బ్రిటన్ పార్లమెంట్ బిల్డింగ్‌లో బయటపడ్డ 400 ఏళ్ల నాటి సీక్రెట్ డోర్

ఒకప్పుడు రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యానికి రాజధానిగా, రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన లండన్‌ నగరం ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది.రాజకీయంగా, వైజ్ఞానిక, విద్య, వినోదం, కళలు, ఫ్యాషన్ రాజధానిగా ఉన్న లండన్ నగరంలో అనేక చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి.

 Secret Doorway Discovered Under Parliament Of Britain In London-TeluguStop.com

దీనిలో ఒకటి బ్రిటన్ పార్లమెంట్ భవనం.ప్రస్తుతం క్రితం భవనంలో రీస్టోరేషన్ పనులు జరుగుతున్నాయి.

ఇందుకోసం పార్లమెంట్ ఆర్కిటెక్చర్ అండ్ హెరిటేజ్ టీం పరిశీలిస్తుండగా హౌస్ ఆఫ్ కామన్స్ అడుగున ఓ సీక్రెట్ డోర్‌ను గుర్తించారు.దీనిని 17వ శతాబ్ధం నాటిదిగా భావిస్తున్నారు.

1661లో కింగ్ చార్లెస్-II పట్టాభిషేకం సందర్భంగా దీనిని నిర్మించినట్లుగా తెలుస్తోంది.బ్రిటన్ పార్లమెంట్ బిల్డింగ్‌కు సంబంధించిన వివరాల కోసం స్వీడన్‌లోని హిస్టారిక్ ఇంగ్లాండ్ ఆర్కైవ్స్‌లో ఉన్న 10 వేల డాక్యుమెంట్లను పరిశీలిస్తున్నప్పుడు వెస్ట్ మినిస్టర్ హాల్ వెనుక ఈ పురాతన ద్వారం ఉందని గుర్తించినట్లు హిస్టరీ ప్రొఫెసర్ లిజ్ హలాం స్మిత్ తెలిపారు.

Telugu Britain, London, Secret Doorway, Secretdoorway, Telugu Nri-Telugu NRI

ఆ డోర్ ఎక్కడుందో తెలుసుకునేందుకు తమ బృందం ప్రయత్నించిందని, దీనిలో భాగంగానే రెండు నుంచి మూడున్నర మీటర్ల ఎత్తైన చెక్కతో చేసిన తలుపులను గుర్తించామని స్మిత్ తెలిపారు.వీటి వెనుకే హౌస్ ఆఫ్ కామన్స్‌కు కనెక్ట్ అయ్యే ఈ సీక్రెట్ డోర్‌ ఉందని చెప్పారు.

Telugu Britain, London, Secret Doorway, Secretdoorway, Telugu Nri-Telugu NRI

చెట్ల వయసును నిర్థారించే డెండ్రోక్రోనాలజీ ఆధారంగా ద్వారాన్ని తయారు చేయడానికి ఉపయోగించిన కలప 1659 నాటిదిగా తేల్చారు.హౌస్ ఆఫ్ లార్డ్స్ ఉండే ప్రాంతం నుంచి రాజు, రాణి నివసించే అంత:పురాన్ని ఆ దారి కలుపుతుందని స్మిత్ చెప్పారు.ఈ ద్వారంతో పాటు 1834లో మేషన్‌లూ గోడపై పెన్సిల్‌తో రాసిన గ్రాఫిటీని అధికారులు గుర్తించారు.250 సంవత్సరాలు గడుస్తున్నా గ్రాఫిటీ చెక్కుచెదరలేదన్నారు.థేమ్స్ నది ఒడ్డున వున్న వెస్ట్ మినిస్టర్ నగరంలో ఉన్న బ్రిటీష్ గవర్నమెంట్ కాంప్లెక్స్‌లో హౌస్ ఆఫ్ కామన్స్‌ ఒక భాగం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube