సముద్రఖని వేగమే బ్రో సినిమాకు శాపమా.. ఇలా చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ అంటూ?

ఈరోజు విడుదలైన బ్రో సినిమా( BRo movie )కు ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ వస్తుంది.పవన్ ఫ్యాన్స్ కు ఈ సినిమా ఫుల్ మీల్స్ అని మిగతా అభిమానులకు మాత్రం ప్లేట్ మీల్స్ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

 Samudrakhani Speed Is The Minus For Bro Movie Details Here Goes Viral In Social-TeluguStop.com

అయితే సముద్రఖని వేగమే బ్రో సినిమాకు శాపమని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సినిమాను చుట్టేసిన భావన కలుగుతోందని చెబుతున్నారు.

Telugu Gopala Gopala, Kollywood, Samudrakhani, Thaman, Tollywood, Trivikram-Movi

గ్రాఫిక్స్ విషయంలో మినిమం కేర్ తీసుకోలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పవన్ అభిమానులను మెప్పించడం కోసం క్రియేట్ చేసిన కొన్ని సీన్ల వల్ల కథలో ఆత్మ మిస్ అయిందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.యముడికి మొగుడు, గోపాల గోపాల( Gopala Gopala ) సినిమాలను గుర్తు చేసే విధంగా కొన్ని సీన్లు ఉన్నాయని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.స్క్రీన్ ప్లే విషయంలో ఎన్నో తప్పులు ఉన్నాయి.

Telugu Gopala Gopala, Kollywood, Samudrakhani, Thaman, Tollywood, Trivikram-Movi

త్రివిక్రమ్( Trivikram ) డైలాగ్స్ వింటే నిజంగానే త్రివిక్రమ్ ఈ సినిమా కోసం పని చేశారా? అనే అనుమానం కలుగుతుంది.కంగాళీ కథనం బ్రో సినిమాకు అతిపెద్ద మైనస్ అయింది.పవన్ స్టామినా వల్ల ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్లకు ఢోకా లేకపోయినా సోమవారం రోజున ఈ సినిమా తుది ఫలితం తేలే ఛాన్స్ ఉంది.ఫస్టాఫ్ లో కొన్ని సీన్లలో సాయితేజ్ డైలాగ్స్ కు లిప్ సింక్ కాలేదు.

అద్భుతమైన కథకు సరితూగేలా కథనం విషయంలో సముద్రఖని జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.గ్రాఫిక్స్ కు మరి కొంత సమయం కేటాయించి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది.

వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చిన థమన్ నుంచి మంచి పాటలను రాబట్టుకునే విషయంలో సముద్రఖని జాగ్రత్త పడి ఉంటే బాగుండేది.సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ సినిమా రిజల్ట్ బెటర్ గా ఉండేది.

బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాల్సిన బ్రో సినిమాను సముద్రఖని అబవ్ యావరేజ్ గా నిలిపారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube