టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి సమంత ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీ గడుపుతూ ఉన్నారు అయితే ఇటీవల ఈమె ఇండస్ట్రీకి చిన్న విరామం ప్రకటించారు.తనకు అనారోగ్య సమస్యలు రావడం చేతనే ఇండస్ట్రీకి విరామం ఇచ్చినటువంటి సమంత( Samantha ) త్వరలోనే రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతుంది.
ఇక ఈమె సినిమాలకు దూరమైనా సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
ఈ క్రమంలోనే తన హెల్త్ గురించి ఎన్నో విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నటువంటి సమంత తాజాగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినటువంటి పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ గురించి ఈమె పలు వ్యాఖ్యలు చేశారు.
అంతే కాకుండా వీరికి కొన్ని టాగ్స్ కూడా ఇచ్చారు.ఈమె టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అందరి సరసన నటించిన మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే.
అయితే ఈ ముగ్గురు హీరోల గురించి ఇచ్చిన టాగ్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ ఎన్టీఆర్ కి( NTR ) బెస్ట్ డాన్సర్ అనే ట్యాగ్ ఇచ్చారు.ఎన్టీఆర్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేస్తారని విషయం మనకు తెలిసిందే.వీరిద్దరి కాంబినేషన్లో బృందావనం, రామయ్య వస్తావయ్య, రభస, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు వచ్చాయి.ఇక మహేష్ బాబుకి( Mahesh Babu ) మోస్ట్ డిజైరబుల్ అనే ట్యాగ్ ఇచ్చారు.
మహేష్ బాబుతో కలిసి సమంత దూకుడు, బ్రహ్మోత్సవం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలలో నటించారు.ఇక పవన్ కళ్యాణ్( Pawan Kalyan )తో కలిసి ఈమె నటించిన అత్తారింటికి దారేది సినిమా ఎంతో మంచి సక్సెస్ అందుకుంది.ఇక పవన్ గురించి ఈమె స్పందిస్తూ మై గురు అంటూ ట్యాగ్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ తో తనకున్నది గురుశిష్యుల అనుబంధం అంటూ ఈ సందర్భంగా సమంత చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి