టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో సూపర్ స్టార్ మహేష్ బాబు( Mahesh Babu ) ఒకరు.ఈయన కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఇండస్ట్రీలో అంచలంచెలుగా ఎదుగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని స్టార్ హీరోగా గుర్తింపు పొందారు.
ఇటీవల గుంటూరు కారం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి మహేష్ బాబు ఈ సినిమా ద్వారా కొన్ని విమర్శలు ఎదుర్కొన్న కలెక్షన్ల పరంగా మాత్రం మంచి వసూళ్లు రాబట్టింది.
ఇకపోతే ప్రస్తుతం ఈయన రాజమౌళి( Rajamouli ) దర్శకత్వంలో రాబోతున్నటువంటి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నారు.వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందనే విషయం తెలిసి సినిమాపై భారీ స్థాయిలోనే అంచనాలు పెంచేశారు.ఇక ఈ సినిమా ఈ ఏడాది షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మహేష్ బాబు తన వ్యక్తిగత విషయాలతో పాటు కెరీర్ కి సంబంధించి ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే.
ఈయన ఇప్పటివరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అందరి సరసన నటించారు.అయితే ఈయనకు కనుక మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోవాలి అనుకుంటే ఏ హీరోయిన్ తో మీరు స్క్రీన్ పంచుకోవడానికి ఆసక్తి చూపుతారు అనే ప్రశ్న ఎదురయింది.ఈ ప్రశ్నకు మహేష్ బాబు సమాధానం చెబుతూ త్రిష ( Trisha ) పేరును చెప్పారు.
త్రిషతో స్క్రీన్ స్పేస్ బాగుంటుందనీ, అంతేకాదు ఆమెతో సీన్స్ చాలా ఈజీగా నటించవచ్చట.ఆమెతో ఉన్న ఫ్రెండ్షిప్ నే అందుకు కారణం అని తెలిపారు.ఇక త్రిష కాకుండా తర్వాత సమంత( Samantha ) తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి మహేష్ ఇష్టపడుతున్నట్లు చెప్పారు.కానీ తన భార్య నమ్రత( Namrata ) తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఈయన చెప్పకపోవడం గమనార్హం.