Sai Pallavi : నేను పారితోషికం డిమాండ్ చేసేది కేవలం అప్పుడే : సాయి పల్లవి

చాలా మంది ఒక్క సినిమా విజయం సాధిస్తే చాలు ఆ తర్వాత నటించే సినిమా కోసం బడ్జెట్ అమాంతంగా పెంచేస్తుంటారు.వారు తీసుకునే రెమ్యునరేషన్( Remuneration ) పెరగడం సినిమాకు కొన్నిసార్లు ఇబ్బంది కావచ్చు.

 Sai Pallavi About Her Remuneration-TeluguStop.com

కొంతమంది అడిగిన డబ్బు ఇచ్చే పొజిషన్లో ఉన్న చాలా మటుకు చిన్న బడ్జెట్ సినిమాలే వస్తున్న క్రమంలో కొంతమంది ఇవ్వడానికి ఇబ్బందులు పడొచ్చు.కానీ ఆ విషయాల గురించి ఆలోచించే వారు ఎవరున్నారు.

మాకు ఇంత కావాలి అని డిమాండ్ చేసేవారు ఇండస్ట్రీలో ఉన్నారు.కానీ పరవాలేదు ఇవ్వకపోయినా కంటెంట్ బాగుంది కాబట్టి సినిమా ముందుకు వెళ్లాలి అని చెప్పేవారు ఎంతమంది ఉంటారు.

ఇలా చెప్పాలి అంటే వారికి మంచి మనసు ఉండి తీరాలి.

Telugu Demand, Sai Pallavi, Small-Movie

అంత మంచి మనసు ఎవరికైనా ఉంటుందా అని ఒక్కసారి ప్రశ్నిస్తే అందరు వేళ్ళు సాయి పల్లవి( Sai Pallavi ) చూపిస్తాయి.ఎందుకు అంటే ఇటీవల ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెమ్యునరేషన్ గురించి ప్రశ్నించగా తన మనసులో మాటను బయట పెట్టింది.కొన్నిసార్లు మాత్రమే డబ్బుల విషయంలో అడుగుతానని, కానీ ఇవ్వలేని వారిని ఎప్పుడూ ఇంత వరకు అడిగింది లేదు అని, ఎంత ఇచ్చినా తీసుకుంటానని పారితోషకం విషయంలో డిమాండ్ చేయడం తనకు ఇష్టం లేదని ఒకవేళ గనుక నేను డాక్టర్ వృత్తిలో ఉండి ఉంటే ఖచ్చితంగా అందరికి ఫ్రీ సర్వీస్( Free Service ) చేయలేను.

కానీ అవసరమైన ప్రతిసారి చేయడానికి ముందు ఉంటానని, కొన్నిసార్లు పే చేయగలిగే వారు పే చేస్తారు.చేయలేని వారు చేయరు కదా.సినిమా విషయం కూడా ఇంచుమించు అలాగే ఆలోచిస్తానని చెబుతుంది సాయి పల్లవి.

Telugu Demand, Sai Pallavi, Small-Movie

సినిమా బాగున్నప్పుడు పారితోషకం గురించి ఏ రోజు ఆలోచించలేదని సినిమా మాత్రమే ముందుకు వెళ్లాలని పరితపిస్తానని డబ్బులు ఇచ్చే పెద్ద ప్రొడ్యూసర్స్ ఎలాగూ ఇస్తారు కాబట్టి చిన్న సినిమా( Small Movies ) గురించి మాత్రమే డబ్బు గురించి ఆలోచించను అని చెబుతుంది సాయి పల్లవి.ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది సాయి పల్లవి సమాధానంతో ఫిదా అయిపోయారు.ఇప్పటికే ఆమె తన అందంతో, ఆహార్యం తో ఆకట్టుకునే మాటలతో ఎన్నోసార్లు మన మనసులను హత్తుకునేలా ప్రవర్తించింది.

కానీ రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమె మాట్లాడిన విధానం చూసి చాలామంది ముచ్చట పడుతున్నారు.ఇలాగే అందరూ హీరోయిన్స్ ఆలోచిస్తే సినిమా స్థాయి ఎప్పుడో పెరిగిపోయి ఉండేదని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube