సప్త సాగరాలు దాటి.ఈ సినిమా పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చి పేరు రుక్మిణి వసంత్( Rukmini Vasanth ).ఈ సినిమాతో బాగా పాపులారిటీని సంపాదించుకుంది రుక్మిణి.ఈ సినిమాతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేకపోయింది.అయినప్పటికి రుక్మిణి వసంత్ కు మంచి గుర్తింపు దక్కింది.
ఇందులో సాంప్రదాయం మైన పద్ధతిలో సంప్రదాయబద్ధమైన లుక్ తో అందరి హృదయాలని గెలుచుకుంది.ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వసంత్ కీ ఈ సినిమా తర్వాత మంచి మంచి అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి.
అయితే ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి.
ఒకటి ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ సినిమా( NTR , Prashant Neel movie ), రెండోది కాంతార 2.దాంతో పాటు నాలుగైదు సినిమాల కోసం అడ్వాన్సులు తీసుకుందట.ఎన్టీఆర్ సినిమా అంటే.
దాదాపుగా సెటిల్‌మెంట్ కి దగ్గర వచ్చేసినట్టే.పైగా ప్రశాంత్ నీల్ మూవీ.
దాంతో పాటు కాంతార 2( Kantara 2 ).ఈ రెండు సినిమాలు చాలు, రుక్మిణి స్టార్ డమ్ ఏంటో చెప్పడానికి.అయితే ఈ రెండు సినిమాలే ఇప్పుడు రుక్ముణి ముందరి కాళ్లకు బంధమేసినట్టు అయ్యింది.ఎన్టీఆర్ సినిమా పూర్తయ్యేంత వరకూ మరో సినిమా చేయకూడదని ఎగ్రిమెంట్ లో ఉందట.
ప్రశాంత్ నీల్ చాలా నిదానంగా సినిమాలు తీస్తుంటాడు.ఆయనకు ఎప్పుడు డేట్లు కావాలో ఆయనకే తెలీదు.
కాబట్టి అందర్నీ లాక్ చేసేస్తారు.కాంతార 2 విషయం లోనూ ఇదే జరిగింది.
తన సినిమా అయ్యేంత వరకూ మరో సినిమా చేయకూడదని రిషబ్ రూల్ పెట్టాడట.
దానికి కూడా అంగీకారం తెలిపింది రుక్మిణి.ఈ రెండు సినిమాలతోనే సతమతమవుతుంటే, రుక్మిణి ఒప్పుకొన్న చిన్నా చితకా సినిమాలు నాలుగైదు ఉన్నాయి.వాళ్లంతా ఇప్పుడు డేట్ల కోసం క్యూ కట్టారు.
ఎన్టీఆర్ సినిమా కోసం ఎగ్రిమెంట్ చేస్తున్నప్పుడే రుక్మిణి డిసైడ్ అవ్వాల్సింది.మిగిలిన సినిమాలు చేయకూడదని.
కానీ వచ్చిన అడ్వాన్ కూడా అందుకొంది.ఇప్పుడు వాళ్లకు సమాధానం చెప్పలేక సతమతమవుతోందట.
అయితే కేవలం రుక్మిణి విషయంలోనే కాదు.చాలామంది హీరోయిన్ ల విషయంలో కూడా ఇదే సీన్ రిపీట్ అవుతోంది.
పెద్ద హీరో సినిమాలో ఛాన్స్ వచ్చింది కదా, అని రెడీ అయిపోతున్నారు.కానీ ఎగ్రిమెంట్లు మాత్రం వాళ్లని అరెస్ట్ చేస్తున్నాయి.
ఆ సినిమా పూర్తవ్వదు, మిగిలిన సినిమాలకు పని చేసేందుకు అవ్వదు.ఎన్టీఆర్,ప్రశాంత్ నీల్ సినిమా ఎప్పుడు మొదలవుతుందో, ఎప్పుడు పూర్తవుతుందో రుక్ముణి మిగిలిన సినిమాలకు డేట్లు ఎప్పుడు ఇస్తుందో?చూడాలి మరి.