రామ్‌ చరణ్ యాంటీ ఫ్యాన్స్ రచ్చ.. అది అల్లూరి కాదు రామడు

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన ఆర్‌ ఆర్ ఆర్ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం పాత్రలో మరియు రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే.

 Rrr Alluri Sitaramaraju Look Goes Viral And Get Bad Comments Also , Alluri Sitar-TeluguStop.com

కొమరం భీమ్ ఎలా ఉంటాడో ఎక్కువగా తెలియదు.కనుక ఎన్టీఆర్ చూసి అలాగే ఉంటారేమో అని అంతా భావిస్తున్నారు.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే అల్లూరి సీతారామ రాజు గురించి తెలుగు వారికి అందరికీ తెలుసు.కనుక సినిమాలో రామ్ చరణ్ చూసి నిజంగా అల్లూరి సీతారామ రాజు ఇలాగే ఉండేవాడేమో అంటూ కామెంట్ చేస్తున్నారు.

అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ నటించిన అల్లూరి సీతారామరాజు సినిమాలో మాదిరిగానే ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ కనిపించాడు.

Telugu Rajamouli, Ram Charan-Movie

అల్లూరి సీతారామ రాజు తెలుగు ప్రేక్షకులకు మరియు జనాలకు తెలుసు.కాని హిందీ ప్రేక్షకులకు రామరాజు గురించి తెలియదు.ఈ సినిమాలో రామ్ చరణ్ పోషించిన పాత్ర అల్లూరి సీతారామరాజు పాత్ర అని తెలియక పోవడం విశేషం.

దాంతో వారు ఈ సినిమాలో రామ్ చరణ్ ని క్లైమాక్స్ లో చూసి శ్రీరామచంద్రుడు అని అనుకుంటున్నారు.దేవుడి పాత్రలో కనిపించనున్నాడు అని వారు భక్తితో పూజిస్తున్నారు అంటూ కొన్ని చోట్ల ప్రచారం జరుగుతుంది.

అల్లూరి సీతారామ రాజు శ్రీరాముడు అయ్యాడు అంటూ కొందరు రామ్ చరణ్ యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా తెగ ప్రచారం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.రామ్ చరణ్ ఏం చేసినా ఇలాగే ఉంటుంది.

అల్లూరి సీతారామరాజు గా నటిస్తే అది కాస్త శ్రీరాముడిగా బయట ప్రచారం జరుగుతుంది అంటూ వారు కామెంట్ చేస్తున్నారు.అయితే అల్లూరి సీతారామ రాజు వారికి తెలియదు కనుక ఆ పాత్రను శ్రీరాముడు అనుకోవడంలో ఎలాంటి తప్పు లేదు.

ఎలాంటి ఇబ్బంది లేదు.సినిమాలో ఆయన పాత్రకు నూటికి నూరు శాతం న్యాయం చేసాడు.

అది ఒక్కటి చూసుకుంటే చాలు అంటూ మెగా అభిమానులు వారికి కౌంటర్ ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube