వైసీపీ మంత్రి రోజా( YCP Minister Roja ) చంద్రబాబు, పవన్, లోకేష్ లపై సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.బుడబుక్కులోళ్లు అంటూ.
ముగ్గురు నాయకులపై మండిపడింది.ప్రతి సంక్రాంతికి బుడబుక్కులోళ్లు వస్తుంటారు.
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ ముగ్గురు అదే మాదిరిగా ఎప్పుడు చూసినా కనిపిస్తుంటారు.జనసేనని సుదీర్ఘ ఉపన్యాసాలు చేసే వ్యక్తి.
మరొకరు మొన్ననే ఢిల్లీ నుండి వచ్చారు అంటూ లోకేష్( Nara Lokesh ) పై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.ఇంకొకరు చంద్రబాబు.
అయితే ఈ ముగ్గురు బుడబుక్కులోళ్లు ప్రజలకు ఏం చేస్తారో చెప్పారు.కానీ మైకు పట్టుకుంటే మాత్రం పిచ్చి వాళ్ళు మాదిరిగా ఊగిపోతుంటారు.
ఇంకా ఏదైనా ఉంది అంటే జగన్ మోహన్ రెడ్డి( YS Jagan ) గారి పైన బురద జల్లుతుంటారు.
జగనన్న కంటిలో భయం లేదు.ఒంట్లో బెదురు లేదు.వచ్చే ఎన్నికలలో జగనన్న మళ్లీ మిమ్మల్ని కొట్టే దెబ్బలకి కూడా తిరుగు లేదని అన్నారు.
ఈ ముగ్గురి నాయకులకి ప్రజల మీద అభిమానం లేదని అన్నారు.ప్రజలకు మంచి చేయాలనే చిత్తశుద్ధి లేదు.
వాళ్లు స్టేజీల పైన మైకు పట్టుకుంటే కేవలం వైసీపీ వాళ్ళని తరిమికొడతామని ప్రసంగాలు చేస్తారు.కేవలం మాపై పగ తీర్చుకోవడానికి.
జనాలు మీకు ఓట్లు వేయాలా అని రోజా ప్రశ్నల వర్షం కురిపించారు.ఏదైనా పార్టీకి ఓటు వేయాలంటే ఆ పార్టీ మనకి, మన పిల్లలకు, మన ఊరికి ఏం చేస్తుందో వాటిని పరిగణలోకి తీసుకొని.
ప్రజలు ఓటు వేస్తారు.ఆ సంగతి.
ఈ బుడబుక్కులోళ్లు తెలుసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నట్లు మంత్రి రోజా సంచలన స్పీచ్ ఇచ్చారు.