జబర్దస్త్ షో ద్వారా, ఇతర టీవీ షోల ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న వాళ్లలో రీతూ చౌదరి( Ritu Chaudhry ) ఒకరు.తాజాగా అలీ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అలీతో ఆల్ ఇన్ వన్( Alitho All in One ) ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో రీతూ చౌదరి చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి.
యాంకర్ అలీ ఏ ఊరు మీది అని రీతూ చౌదరిని అడగగా తనది ఆంధ్రా తెలంగాణ బోర్డర్ అని ఆమె సమాధానం ఇచ్చారు.తాను అక్కడా ఉంటానని ఇక్కడా ఉంటానని రీతూ చౌదరి చెప్పుకొచ్చారు.
ఒక గేమ్ లో భాగంగా అల్లు అర్జున్ ఫోటోను రీతూ చౌదరి కరెక్ట్ ప్లేస్ లో పెట్టగా అలీ ఆమెను అల్లు అర్జున్( Allu Arjun ) ఫ్యానా అని అడిగారు.రీతూ చౌదరి వెంటనే నాగచైతన్యను పెళ్లి చేసుకుందామని ఇండస్ట్రీకి వచ్చానని కామెంట్లు చేశారు.అయితే రీతూ చౌదరి జోక్ గా చెప్పిందా సీరియస్ గా చెప్పిందా అనే ప్రశ్నకు మాత్రం జవాబు దొరకాల్సి ఉంది.ఈ నెల 26వ తేదీన రాత్రి 9.30 గంటలకు ఈ షో ప్రసారం కానుంది.
ఫుల్ ఎపిసోడ్ లో రీతూ చౌదరి( Rithu chowdary ) ఏం చెప్పారో చూడాల్సి ఉంది.ఇన్ స్టాగ్రామ్ లో రీతూ చౌదరికి ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు.కెరీర్ ను సరిగ్గా ప్లాన్ చేసుకుంటే రీతూ చౌదరి ఖాతాలో మరిన్ని విజయాలు చేరతాయని చెప్పవచ్చు.
రీతూ చౌదరి తన టాలెంట్ ను కరెక్ట్ గా ఉపయోగించాలని వివాదాలకు, వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.రీతూ చౌదరి తన టాలెంట్ తో అవకాశాలను మరింత పెంచుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో రీతూ చౌదరి కెరీర్ పరంగా మరింత ఎదిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి.బుల్లితెరపై రీతూ చౌదరి క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.