అమెరికాలో దారుణం: సీఈవోను ముక్కలు ముక్కలుగా నరికి హత్య చేసిన దుండగులు

అమెరికాలో దారుణం జరిగింది.తన తెలివితేటలు, సత్తాతో వ్యాపారంలో దూసుకుపోతున్న యువ పారిశ్రామిక వేత్తను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు.

 Bangladesh Origin Ride-hailing App Ceo Found Dismembered In New York Flat, Ride--TeluguStop.com

న్యూయార్క్‌లో రవాణా, ఫుడ్ డెలీవరి సేవలు అందించే సంస్థ సహ వ్యవస్థాపకుడు ఫాహిమ్ సలేహ్‌ను ఆయన ఫ్లాట్‌లోనే అగంతకులు హత్య చేసి, ముక్కలు ముక్కలుగా నరికారు.ఫాహిమ్ సోదరి అక్కడికి వచ్చే సరికి ఆయన మృతదేహం రక్తపు మడుగులో పడివుంది.
హత్య జరిగిన తీరును బట్టి కిరాయి హంతకులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు భావిస్తున్నారు.మరోవైపు ఫాహిమ్ సోదరి అక్కడికి వచ్చే సరికి నిందితుడు ఘటనాస్థలిలోనే ఉన్నట్లు భావిస్తున్నారు.

ఆమె రాకతో అలికిడి కావడంతో దుండగులు ఫ్లాట్ నుంచి తప్పించుకుని వుంటారని పోలీసులు చెబుతున్నారు.సీసీ కెమెరాలో సైతం ఓ వ్యక్తి ఫాహిమ్ వెనుకనే వచ్చినట్లుగా గుర్తించారు.

Telugu Fahim Saleh, York, App Ceo-

బంగ్లాదేశ్ మూలాలున్న దంపతులకు సౌదీ అరేబియాలో జన్మించిన ఫాహిమ్ న్యూయార్క్‌లోనే పెరిగాడు.మూడు పదుల వయసులోనే ‘‘పథావ్’’ అనే స్టార్టప్‌ను స్థాపించి బంగ్లాదేశ్‌లో రవాణా, ఫుడ్ డెలీవరి, చెల్లింపుల రంగాల్లో సేవలు అందిస్తున్నాడు.ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ 100 మిలియన్ డాలర్లు.ఓ వైపు పథావ్‌‌ సేవలను విస్తరిస్తూనే.నైజీరియాలో ‘‘గోకడ’’ అనే సంస్థను స్థాపించాడు.ఇది క్యాబ్, డెలీవరీ సర్వీసులను అందిస్తోంది.ఇందుకోసం ఫాహిమ్ 6.9 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube