మైగ్రేన్ తలనొప్పి.ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య ఇది.అధిక ఒత్తిడి, అతిగా నిద్రపోవడం, నిద్రలేమి, డీహైడ్రేషన్, ఎప్పుడూ ఏడుస్తూనే ఉండటం, కంప్యూటర్ల ముందు గంటలు తరబడి కూర్చుని పని చేయడం వంటి రకరకాల కారణాల వల్ల మైగ్రేన్ బారిన పడుతుంటారు.ఇది ఎంతో బాధాకరంగా ఉంటుంది.
అందుకే మైగ్రేన్‌ను వదిలించుకోవడం కోసం తెగ మందులు వాడుతుంటారు.అయితే న్యాచురల్‌గా కూడా మైగ్రేన్‌ను నివారించుకోవచ్చు.
అందుకు ఇప్పుడు చెప్పబోయే నూనె అద్భుతంగా సహాయపడుతుంది.
మరి ఆ నూనె ఏంటీ.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా పది నుంచి ఇరవై శంఖు పుష్పాలను సేకరించి కాడలను తొలగించి నీటిలో శుభ్రంగా కడగాలి.కడిగిన పుష్పాలను తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నెను పెట్టుకుని రెండు గ్లాసుల వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో మరో గిన్నెను పెట్టుకోవాలి.
ఆ గిన్నెలో ఒక కప్పు ఎక్ట్రా వర్జిన్ కొకనట్ ఆయిల్‌ను పోయాలి.ఆయిల్ హీట్ అవ్వగానే అందులో శంఖు పుస్పాలను వేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు మరిగించాలి.
ఆపై స్టవ్ ఆఫ్ చేసి మరిగిన నూనెను చల్లారబెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన తర్వాత నూనెను మాత్రం సపరేట్ చేసుకుని ఒక బాటిల్‌లో నింపుకోవాలి.

ఇక ఈ నూనెను ఎలా వాడాలో కూడా చూసేయండి.నైట్ నిద్రించే ముందు తయారు చేసుకున్న నూనెను తలకు పట్టించి పావు గంట పాటు మసాజ్ చేసుకుని పడుకోవాలి.ఇలా ప్రతి రోజు రాత్రి ఆయిల్‌ను అప్లై చేసుకుంటే.
శంఖు పుష్పాల్లో ఉండే ఔషధ గుణాలు మైగ్రేన్ సమస్యను క్రమంగా నివారిస్తాయి.పైగా ఇప్పుడు చెప్పిన ఆయిల్‌ను వాడితే జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యల నుంచి సైతం ఉపశమనం పొందొచ్చు.







