రేవంత్ రెడ్డి భారీ స్కెచ్.. ఆ స్థానాలన్నీ హస్తగతమేనా..?

ప్రస్తుతం తెలంగాణ (Telangana) లో రాజకీయాలు వేడెక్కాయి.కొన్ని నెలల్లో ఎలక్షన్స్ రానున్న తరుణంలో అన్ని పార్టీలు నువ్వా నేనా అనే విధంగా పోరాడుతున్నాయి.

 Revanth Reddy Huge Sketch All Those Seats Are Held By Congress Details, Brs ,con-TeluguStop.com

ముఖ్యంగా ఈసారి బిఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య విపరీతమైన పోటీ ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే బీఆర్ఎస్ (BRS) పార్టీ 115 మంది అభ్యర్థులను ప్రకటించింది.

కాంగ్రెస్ కొన్ని స్థానాలను ప్రకటించింది.కాస్త పోటీ ఎక్కువగా ఉండే స్థానాలను పూర్తిగా ఈ నెలలో ప్రకటించే అవకాశం ఉంది.

ఇదే తరుణంలో రేవంత్ రెడ్డి (Revanth reddy) కూడా ఆచితూచి ఆలోచించి ఈసారి పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలని చూస్తున్నారు.అయితే తాజాగా భారీ స్కెచ్ రేవంత్ టీం వేసినట్టు కనిపిస్తోంది.

Telugu Congress, Revanth Reddy, Sabitha Indra, Telangana-Politics

లాస్ట్ టైం ఎలక్షన్స్ లో కాంగ్రెస్ (Congress) పార్టీ తరపున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.ప్రస్తుతం కెసిఆర్( KCR ) మళ్ళీ టికెట్లు ప్రకటించారు.ఇదే తరుణంలో కాంగ్రెస్ గుర్తుపై గెలిచిన స్థానాలను ఎలాగైనా ఈసారి హస్తగతం చేసుకోవాలని కాంగ్రెస్ భారీ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది.ఆయా స్థానాలలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలని వ్యూహాత్మక ఆలోచన చేసినట్టు సమాచారం.

Telugu Congress, Revanth Reddy, Sabitha Indra, Telangana-Politics

ముఖ్యంగా కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన ఎమ్మెల్యేలలో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indrareddy) , పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి,( Upender Reddy ) సుధీర్ రెడ్డి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, గండ్ర వెంకటరమణారెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి తదితరులున్నారు.వీరంతా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొంది బిఆర్ఎస్ లో చేరారు.కాబట్టి ఈ 12 స్థానాలలో ఈసారి ఎలాగైనా గట్టి అభ్యర్థులను నిలబెట్టి 12 కు 12 కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది.దీనికోసం అన్ని రకాల కసరత్తులు రెడీ చేసి పెట్టింది.

తప్పనిసరిగా ఈసారి వారి స్థానాలలో కాంగ్రెస్ విజయ బావుటా ఎగరవేసే విధంగానే అన్ని రకాల కసరత్తులు చేస్తుందని సమాచారం.మరి చూడాలి ఆ నియోజకవర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడతారా లేదంటే.

కాంగ్రెస్లో గెలిచి బిఆర్ఎస్లోకి వెళ్లిన నాయకుల వైపు నిలబడతారా అనేది ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube