టాలీవుడ్ లో మళ్ళీ రిపీట్ అవుతున్న సూపర్ హిట్ జంటలు ఇవే!

టాలీవుడ్ లో రీల్ కపుల్స్ లో కొంత మంది జంటలను ప్రేక్షకులు బాగా ఇష్టపడతారు.వారు మళ్ళీ మళ్ళీ కలిసి నటిస్తే చూడాలని కోరుకుంటారు.

 Repeat The Super Hit Pairs Upcoming Movies In Tollywood Trisha Sai Pallavi Vijay-TeluguStop.com

అందుకు కారణం ఆ జంటల మధ్య ఉండే కెమిస్ట్రీనే కారణం.అలాగే వారు నటించిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయితే సూపర్ హిట్ జోడీ అనే ముద్ర పడుతుంది.

కానీ కొన్ని సినిమాలు హిట్ అవ్వకపోయిన ఆ జంట మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది.మరి మన టాలీవుడ్ లో కలిసి మళ్ళీ రిపీట్ కాబోతున్న సూపర్ హిట్ జోడీలు ఏంటంటే?

నాగ చైతన్య – సాయి పల్లవి :

అక్కినేని యువ హీరో నాగ చైతన్య,( Naga Chaitanya ) సాయి పల్లవి( Sai Pallavi ) జోడీ మళ్ళీ రిపీట్ కాబోతుంది.ఇప్పటికే ఈ కాంబో లవ్ స్టోరీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి విజయం సాధించింది.ఇక ఇప్పుడు చందు మొండేటి, నాగ చైతన్య కాంబోలో తెరకెక్కనున్న సినిమాలో ఈ అమ్మడే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది.

విజయ్ దళపతి – త్రిష :

ఈ జంట ఇప్పటికే కలిసి నటించారు.మళ్ళీ చాలా ఏళ్ల తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున్నారు.లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లియో సినిమాలో( Leo Movie ) విజయ్, త్రిష కలిసి నటించారు.

రామ్ చరణ్ – కియారా అద్వానీ :

ఈ జంట కూడా ఇప్పటికే కలిసి నటించారు.వినయ విధేయ రామ ( Vinaya Vidheya Rama ) సినిమాతో ఆకట్టుకున్న ఈ జోడీ ఈ సినిమా హిట్ అవ్వకపోయిన మరోసారి రిపీట్ కాబోతుంది.శంకర్ డైరెక్ట్ చేస్తున్న గేమ్ ఛేంజర్ లో( Game Changer ) ఈ జంట మళ్ళీ కలిసి నటిస్తున్నారు.

చిరంజీవి – అనుష్క :

వీరిద్దరూ కూడా కలిసి నటించారు.మళ్ళీ మెగాస్టార్,( Chiranjeevi ) అనుష్క( Anushka ) మెగా 157 లో కలిసి నటించనున్నట్టు టాక్.

రవితేజ – శ్రీలీల :

ఈ జంట ధమాకా వంటి బ్లాక్ బస్టర్ అందుకుని సూపర్ హిట్ జోడీ అనిపించుకుంది.ఇక ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube