సురేష్ బాబు వెంకటేష్ టాలీవుడ్ ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. రామానాయుడు కొడుకులైన సురేష్ బాబు వెంకటేష్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
వెంకటేష్ హీరోగా సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తుండగా సురేష్ బాబు టాలీవుడ్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా ఉన్నారు.అయితే ఒక విషయానికి సంబంధించి సురేష్ బాబు వెంకటేష్ మధ్య గొడవలు జరుగుతున్నాయని సమాచారం.
ఫుడ్ విషయంలో మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతాయని సురేష్ బాబు అన్ స్టాపబుల్ షోలో వెల్లడించారు.ఆస్తుల పంపకాలు మాత్రం ఇప్పటికీ జరగలేదని సురేష్ బాబు వెల్లడించారు.
తాను వెంకటేష్ తో ఏ సినిమా చేసినా వెంకటేష్ కు సగం రెమ్యునరేషన్ మాత్రమే ఇస్తానని ఆయన చెప్పడం హాట్ టాపిక్ అవుతోంది.సగం పారితోషికం మాత్రమే ఇచ్చినా వెంకటేష్ ఎలాంటి కామెంట్ చేయరని ఆయన వెల్లడించారు.
సురేష్ బాబు బ్యానర్ లో తెరకెక్కిన చాలా సినిమాలలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించి సక్సెస్ లను అందుకున్నారు.సురేష్ బాబు కమర్షియల్ ప్రొడ్యూసర్ అని కొంతమంది కామెంట్ చేసినా ఆయన తనకు ఆర్థికంగా బెనిఫిట్ కలిగేలా సినిమాలను ప్లాన్ చేసుకుంటారనే సంగతి తెలిసిందే.
వెంకటేష్ హీరోగా నటించిన పలు సినిమాలను సురేష్ బాబు ఓటీటీలో రిలీజ్ చేయడం హాట్ టాపిక్ అయింది.
ఈ విషయంలో కొంతమంది సురేష్ బాబుపై విమర్శలు చేసినా ఆయన మాత్రం వెనక్కు తగ్గలేదు.అన్ స్టాపబుల్ షోలో సురేష్ బాబు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలతో పాటు సినిమాలకు సంబంధించిన విషయాలను సైతం వెల్లడించారు.సమంతను మహానటి అని సురేష్ బాబు కామెంట్ చేశారు.
ఈ విషయంలో అల్లు అరవింద్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.