Raviteja: హీరోగా సక్సెస్ నిర్మాతగా ఫెయిల్యూర్.. మాస్ మహారాజ్ జాతకాన్ని ఈ సినిమా మారుస్తుందా?

టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ( Raviteja ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రవితేజ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

 Raviteja Needs To Get Hit As A Producer-TeluguStop.com

సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు రవితేజ.ఈ నేపథ్యంలోనే ఇటీవలే ధమాకా, రావణాసుర, వాల్తేరు వీరయ్య లాంటి సినిమాతో ప్రేక్షకులకు పలకరించిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం తదుపరి సినిమాలలో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు రవితేజ.ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో రవితేజకు సంబంధించి ఒక వార్త చెక్కలు కొడుతోంది.

Telugu Changurebangaru, Massmaharaj, Matti Kusthi, Raviteja, Tollywood-Movie

రవితేజకు హిట్స్, ఫ్లాప్స్ కొత్త కాదు.ఒక హిట్ ఇస్తే, ఆ వెంటనే 3-4 ప్లాప్ సినిమాలు ఇవ్వడం అన్నది కామన్.అయితే ఇలా ఎన్ని ఫ్లాపులొచ్చిన రవితేజ మాత్రం డీలా పడలేదు.మరో హిట్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.మరోవైపు రవితేజ నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.తన సినిమాలకు కో-ప్రొడ్యూసర్ గా వ్యవహరించడంతో పాటు, మరికొన్ని చిన్న సినిమాలకు సోలో ప్రొడ్యూసర్ గా కూడా వ్యవహరిస్తున్నాడు.

ఆ మధ్య విష్ణువిశాల్ తో కలిసి మట్టి కుస్తీ( Matti Kusthi ) అనే సినిమా నిర్మించాడు.ఇప్పుడు నిర్మాతగా మరో సినిమా రెడీ చేశాడు రవితేజ.

ఈ సినిమా పేరు ఛాంగురే బంగారురాజా.( Changure Bangaru Raja )

Telugu Changurebangaru, Massmaharaj, Matti Kusthi, Raviteja, Tollywood-Movie

మరికొన్ని గంటల్లో థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా నిర్మాత రవితేజ కు హిట్ ఇస్తుందా ఇవ్వదా ప్రశ్నార్థకంగా మారింది.హీరోగా ఎన్ని ఫ్లాపులొచ్చినా నిలదొక్కుకున్నాడు రవితేజ.అయితే నిర్మాతగా అన్ని ఫ్లాపులిచ్చే పొజిషన్ లో లేడు.

నిర్మాతగా( Producer ) అతడు సక్సెస్ అవ్వాలంటే ఛాంగులే బంగారురాజా సినిమా హిట్ అవ్వాలి.అప్పుడే ప్రొడ్యూసర్ గా మరిన్ని సినిమాలు తీయగలగడు.

మరి ఈ సినిమా ఎటువంటి సక్సెస్ సాధిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube