ఫేస్‌బుక్‌ కి వార్నింగ్ ఇచ్చిన రష్యా     2017-09-27   01:40:26  IST  Raghu V

మా నిభందనలు అనుగుణంగా వ్యవహరించకపోతే మా దేశంలో నిషేధిస్తాం. తమ చట్టాలు అతిక్రమిస్తే వచ్చే ఏడాదికల్లా తమ దేశంలో ఫేస్‌బుక్‌ను నిషేధిస్తామని ప్రకటించింది రష్యా. ఇప్పటివరకూ ఫేస్‌బుక్‌తో తాము ఎలాంటి చర్చలు జరపలేదని..ఇక నుండి మా దేశ చట్టలకి లోబడి అది పనిచేయాలని టెలికం రెగ్యులేటరీ హెడ్‌ అలెగ్జాండర్‌ ఝరోవ్‌ స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఈ హెచ్చరిక​ చేశారు.

ఒక వేళ ఫేస్‌బుక్‌ తమ చట్టాలకి లోబడి పనిచేయకపోతే లింక్డ్‌ఇన్‌ మాదిరిగానే రష్యాలోనిషేధిస్తామని ఝరోవ్‌ వెల్లడించారు..దీనికి సంభందించి తక్షణమే చర్యలు చేపట్టాలని తెలిపారు. వ్యక్తిగత డేటా నిల్వపై రష్యా చట్టం 2015 సెప్టెంబరులో అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం విదేశీ మెసేజింగ్‌ సర్వీసులు, సెర్చ్‌ ఇంజన్లు, సామాజిక మాధ్యమాల వెబ్‌సైట్లు రష్యన్‌ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని నిక్షిప్తం చేయడానికి కావాల్సిన విధివిధానాలను దీనిలో రూపొందించారు. దీని ప్రకారం ఆ దేశస్థుల అన్ని విషయాలను రష్యాలోని సర్వర్లలోనే నిక్షిప్తం చేయాలి.

కానీ ఈ ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ తదితర సామాజిక మాధ్యమాలు వినియోగదారుల సమాచారాన్ని వారి ప్రమేయం లేకుండానే తీసుకోవడం మంచిది కాదు అని రష్యా టెలికాం సంస్థలు ఆరోపిస్తున్నాయి. 2016 అమెరికా ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలపై రష్యన్లకు సంబంధమున్న ఖాతాలను ఉపయోగించారని..ఇలా చేయడం సరైనదేనా అని ప్రశ్నించాయి.ఈ విషయాలని ఫేస్‌బుక్‌ చెప్పిన కొన్ని రోజుల తరువాతే రష్యా ఇలా హెచ్చరికలు జారీచేసింది.ఏది ఎలా ఉన్నా రష్యాలో ఫేస్‌బుక్‌ అడ్డంగా బుక్కై పోయింది.