సినిమా ఇండస్ట్రీలోకి ఏ విధమైనటువంటి అంచనాలు లేకుండా అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అయినటువంటి వారిలో నటి రష్మిక మందన్న ( Rashmika Mandanna ) ఒకరు చిత్ర పరిశ్రమ నుంచి హీరోయిన్గా ఇండస్ట్రీకి వచ్చారు.అయితే తెలుగులో కూడా అవకాశాలు అందుకునే ఇక్కడ ఎంత బిజీగా ఉన్నటువంటి ఈమెకు పుష్ప ( Pushpa ) సినిమాలో అవకాశం వచ్చింది.
ఈ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా స్టార్ హీరోయిన్గా మారిపోయారు.ఇక ఈ సినిమా తర్వాత ఈమెకు భాషతో సంబంధం లేకుండా వరుస భాషా చిత్రాలలో అవకాశాలు రావడంతో కెరియర్ పరంగా ఈమె ఎంతో బిజీ అయ్యారు.
ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రష్మిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.ఇకపోతే తాజాగా ఈమె జపాన్ ( Japan ) వెళ్లిన సంగతి మనకు తెలిసిందే.క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ కి రష్మిక గెస్ట్ గా వెళ్ళింది.ఇక ఈమె జపాన్ వెళ్ళినప్పుడు నుంచి అక్కడ అభిమానుల ఆదరణ చూసి ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అయితే తాజాగా రష్మిక జపాన్ వెళ్లడం గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.
నిన్న రాత్రి జరిగిన క్రంచిరోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ లో స్టేజిపైకి వచ్చి అవార్డుని ప్రజెంట్ చేసింది.తాజాగా రష్మిక జపాన్ లో దిగిన కొన్ని ఫోటోలు షేర్ చేసి ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.చిన్నప్పటినుంచి నేను జపాన్ వెళ్లాలని ఎన్నో కలలు కనే దానిని.
ఇది నిజంగా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.యానిమే అవార్డ్స్ లో భాగం అయ్యాను, ఒకరికి అవార్డు ఇచ్చాను.
ఇక్కడ వారందరూ తనని అక్కడ ఎంతో అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారని ఈమె సంతోషం వ్యక్తం చేశారు.ఇక్కడ వాతావరణం వారు చూపిస్తున్నటువంటి ప్రేమ తనకు ఎంతగానో నచ్చాయని రియల్లీ లవ్ యు జపాన్ అంటూ సంతోషాన్ని వ్యక్తం చేయడమే కాకుండా ప్రతి ఏడాది తాను జపాన్ వస్తానంటూ ఈ సందర్భంగా రష్మిక చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.