ఆర్టిఫిషల్ ఇంటిలిజెన్స్ కారణంగా సెలబ్రిటీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.వారి యొక్క మానసిక పరిస్థితి కూడా ఏఐ టెక్నాలజీ( AI ) దెబ్బ తీసే విధంగా కొందరు ఆకతాయిలు పని చేస్తున్నారు.
ఇటీవల రష్మిక మందన్న( Rashmika Mandanna ) యొక్క మార్ఫింగ్ వీడియో ఎంతటి వైరల్ అయిందో అందరికి తెల్సిందే.ఆ వీడియో ను చాలా మంది జాతీయ స్థాయి నాయకులు మరియు బాలీవుడ్ స్టార్స్ తప్పుబడట్టారు.
ఖండిస్తూ వ్యాఖ్యలు చేశారు.కానీ టాలీవుడ్ నుంచి చైతన్య( Nagachaitanya ) మాత్రమే స్పందించాడు.
ఆ విషయాన్ని మీడియా వర్గాల వారు తప్పుబట్టారు.మేము కూడా టాలీవుడ్ పట్టించుకోవడం లేదు, రష్మిక కి మద్దతుగా టాలీవుడ్ నిలవలేదు అంటూ పేర్కొన్నాం.
మీడియాలో వచ్చిన కథనాలకు స్పందించిన టాలీవుడ్ వర్గాల వారు మెల్ల మెల్లగా రష్మిక కి మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు.ఇలాంటి వారిని క్షమించవద్దు అంటూ పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు( Tollywood Celebrities ) సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.కాస్త ఆలస్యం అయినా కూడా టాలీవుడ్ కు చెందిన వారు స్పందించడం మంచి పరిణామం.ఇలా ఒక్కరి గురించి తప్పుడు వీడియోలు, ఫోటోలు వచ్చిన సమయంలో ఇతరులు అంతా కూడా స్పందిస్తేనే ఇతరుల యొక్క ఫోటోలు, వీడియో లు రాకుండా ఉంటాయి అంటూ సినీ విశ్లేషకులు మరియు మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
సోషల్ మీడియాలో రష్మిక మందన్న యొక్క వీడియో లు ఇప్పటికే తొలగించారు.ఒక వేళ షేర్ చేస్తే కఠిన చర్యలు అంటూ ఇప్పటికే ప్రభుత్వాలు కూడా హెచ్చరించాయి.అందుకే రష్మిక మందన్న కు మద్దతుగా చాలా మంది నిలుస్తున్నారు.ఆ వీడియో లు షేర్ చేయడం లేదు.టాలీవుడ్ లో హీరోయిన్ గా వరుస విజయాల తో దూసుకు పోతున్న రష్మిక త్వరలో హిందీ ఆడియన్స్ ముందుకు యానిమల్ సినిమా తో( Animal Movie ) వెళ్లబోతుంది.అక్కడ విజయాన్ని సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది.
మరి ఆ విజయం సాధించేనా చూడాలి.