మా అమ్మ నగలు అమ్మి నా గర్ల్ ఫ్రెండ్ కోసం అలా చేశా.. రణ్ బీర్ కపూర్ షాకింగ్ కామెంట్స్ వైరల్!

బాలీవుడ్ క్యూట్ కపుల్ రణ్ బీర్ కపూర్, అలియా భట్ ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాలీవుడ్ లో ఉన్న మోస్ట్ లవబుల్ కపుల్స్ లో ఈ జంట కూడా ఒకరు.

 Ranbir Kapoor Spills Beans On Dating Life Reveals Gifting Mom Jewelry To Girlfri-TeluguStop.com

ఈ జంట చాలా కాలం ప్రేమాయణం సాగించి పెళ్లి పీటలెక్కారు.ఈ ఇద్దరూ కలిసి పలు సినిమాల్లోనూ నటించిన విషయం తెలిసిందే.

అలియా కంటే ముందు రణ్ బీర్ కపూర్( Ranbir Kapoor ) బాలీవుడ్ హీరోయిన్స్ అయిన దీపికా పదుకొనె, కత్రినా కైఫ్ లతో ప్రేమాయణం సాగించాడని అప్పట్లో వార్తలు కూడా జోరుగా వినిపించాయి.ఇక 2022 ఏప్రిల్ 14న అలియా భట్ ను( Alia Bhatt ) వివాహం చేసుకున్నాడు రణబీర్.

వీరికి ఒక కూతురు కూడా ఉంది.రణబీర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.అటు అలియా భట్ కూడా సినిమాలు చేస్తోంది.పెళ్లి అయినప్పటికీ ఆలియా భట్ సినిమాలు విషయంలో తగ్గేదేలే అంటోంది.

ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ లో ఒక టీవీ షోకు గెస్ట్ గా హాజరయ్యాడు రణబీర్ కపూర్.ప్రముఖ యాంకర్ కపిల్ శర్మ బాలీవుడ్ లో ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో( The Great Indian Kapil Show ) నిర్వహిస్తున్నాడు.

ఈ కార్యక్రమానికి రణబీర్ హాజరయ్యాడు.

Telugu Alia Bhatt, Aliya Bhatt, Bollywood, Kapil Sharma, Ranbir Kapoor, Ranbirka

ఈ కార్యక్రమంలో రణబీర్ ను చిత్ర విచిత్ర ప్రశ్నలు అడిగాడు కపిల్ శర్మ.( Kapil Sharma ) నీ పెళ్లిలో ఆలియా సిస్టర్స్, స్నేహితులకు బాగానే డబ్బులిచ్చావట గా నిజమేనా? వాళ్లు నీ చెప్పులు దాచిపెట్టి రూ.12 కోట్ల వరకు డిమాండ్‌ చేశారని తెలిసింది.దాని నువ్వు బేరమాడి లక్షరూపాయలు ఇచ్చవట కదా! అని అడిగాడు కపిల్.దానికి రణబీర్ కపూర్ నవ్వుతూ.మేము పెళ్లి చేసుకుంది ఇంట్లోనే ఒకవేళ వాళ్లు నా చెప్పులు దాచిపెట్టిన అవి ఇంట్లోనే ఉంటాయి ఎక్కడికి పోవు అని సరదాగా సమాధానం చెప్పాడు.దానికి కపిల్ మాట్లాడుతూ.

నా పెళ్లిలో కూడా ఇలా చెప్పులు దాచి పెట్టి డబ్బులు డిమాండ్ చేశారు.

Telugu Alia Bhatt, Aliya Bhatt, Bollywood, Kapil Sharma, Ranbir Kapoor, Ranbirka

నన్ను రూ.11 లక్షలు ఇవ్వాలని అన్నారు.దానికి నేను మీ చెల్లితో పాటు ఆ చెప్పులు కూడా మీరే ఉంచుకోండి అని చెప్పాను అని నవ్వులు పూయించాడు.

ఆ తర్వాత రణబీర్ కపూర్ మాట్లాడుతూ.తన గర్ల్ ఫ్రెండ్స్ కు ఇచ్చిన గిఫ్ట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు.తన తల్లి నగలు అమ్మి తన ప్రియురాళ్లకు గిఫ్ట్స్ కొనిచ్చా నాని తెలిపి షాక్ ఇచ్చాడు రణ్ బీర్.ఈ సందర్భంగా రణ్ బీర్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో గర్ల్ ఫ్రెండ్ అంటే రన్బీర్ కి ఎంత ప్రేమ తన తల్లి నగలు అమ్మి మరీ ప్రియురాలికి గిఫ్ట్ కొనిచ్చాడు అంటే రియల్లీ చాలా గ్రేట్ అంటూ కామెంట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube