ఆ సీన్స్ చెప్పకుండానే తీశారు.. కొరటాల శివపై రామ్ చరణ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన తాజా చిత్రం ఆచార్య.ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానున్న విషయం తెలిసిందే.

 Ram Charan Reveals Secret Behind Koratala Siva Shot Tiger And Cheetah Shot Ram C-TeluguStop.com

ఈ సినిమా విడుదల కావడానికి కేవలం ఇంకా మూడు రోజుల సమయం మాత్రమే ఉంది.దీనితో చిత్ర బృందం ప్రమోషన్స్ ను మరింత వేగవంతం చేశారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా రామ్ చరణ్ ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.ట్రైలర్లో అందరికీ నచ్చిన ఒక షాట్ ఉంటుంది చివర్ లో ఉండే ఆ షాట్ కు ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా ఫిదా అయి ఉంటాడు అని తెలిపాడు చెర్రీ.

చివర్లో వచ్చే చిరుత పులి, పులి షాట్.చిరంజీవి, రామ్ చరణ్ షాట్‌కు అందరూ ఆశ్చర్యపోయారు.ఆ సన్నివేశం గురించి తాజాగా రామ్ చరణ్ మాట్లాడుతూ.ఆ సన్నివేశాన్ని తీయబోతున్నారు అని కొరటాల శివ ముందుగా తనకు చెప్పలేదని తెలిపాడు.

ప్యాకప్ చెప్పి వెళ్లే చివరిక్షణంలో ఒకషాట్ ఉందని కొరటాల చెప్పాడట.కాలువ దగ్గర మీరు అలా వాటర్ తాగుతూ ఉండండి.

చిరంజీవి గారు అలా చుట్టూ చూస్తారని చెప్పాడట.అలా నేను వాటర్ తాగుతుంటే.

అలా నాన్న చుట్టూ చూస్తుంటాడు.చుట్టూ అడవి కాబట్టి ఏదైనా డేంజర్ ఉంటుందేమోనని అందుకే అలా చూస్తాడేమోనని నేను అనుకున్నానంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చాడు.

Telugu Acharya, Koratala Shiva, Pooja Hegdhe, Ram Charan, Tollywood-Movie

ఇక కెమెరా అలా పక్క నుంచి మా మీదకు వస్తుండటంతో చిరంజీవి, చెర్రీ ఈ విధంగా అడిగాడట.అలా ఎందుకు కెమెరా అక్కడి నుంచి వస్తోంది.ఏమైనా డేంజర్ ఉందా? అక్కడ అని కొరటాలను అడిగాడట చిరు.కానీ కొరటాల ఏమీ చెప్పలేదట.

మొత్తానికి ఆ షాట్ అయిపోయివడంతో ప్యాకప్ చెప్పి వెళ్లిపోయారట.చివర్లో అసలు విషయం చెప్పాడట.

మీకు ముందు.చిరుత పులి, చిరుత ఉంటుందని చెప్పడంతో చిరంజీవి, రామ్ చరణ్ ఆశ్చర్యపోయారట.

మొత్తంగా ఆ షాట్‌ను పదిహేను నిమిషాల్లో తీసేశారట.ఆ షాటే తనకు ఇష్టమని రామ్ చరణ్ పేర్కొన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube