నవంబర్ మంత్ వచ్చేసింది.దీంతో ఇద్దరి స్టార్ హీరోల ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం కూడా రానే వచ్చింది.
ఇప్పటికే ఒక స్టార్ హీరో తన ట్రీట్ ఇచ్చేసాడు.ఇక మరో స్టార్ హీరో ఇచ్చే బిగ్ ట్రీట్ కోసం ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఫ్యాన్స్ వీరి సినిమాల అప్డేట్స్ కోసం ఎదురు చూసారు.అయితే దీపావళి కానుకగా ఇద్దరు రాబోతున్నట్టు తెలిపారు.
చెప్పినట్టుగానే సూపర్ స్టార్ నుండి ఫ్యాన్స్ కు ట్రీట్ అందింది.మహేష్ బాబు ( Mahesh Babu ) లేటెస్ట్ గా నటిస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ ”గుంటూరు కారం” ( Guntur Kaaram )మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ( Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కోసం అంత ఎంతగానో ఎదురు చూసారు.
మరి దీపావళి కానుకగా నాలుగు రోజులు ముందుగానే ఈ సినిమా నుండి ”దం మసాలా” సాంగ్ ను రిలీజ్ చేయగా అది ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.ఇక సూపర్ స్టార్ ట్రీట్ అయిపోవడంతో మెగా ఫ్యాన్స్ తమ హీరో నుండి ఎప్పుడు ట్రీట్ వస్తుందా అని ఎదురు చూస్తున్నారు.
రామ్ చరణ్ ( Ram Charan ) ప్రజెంట్ నటిస్తున్న సినిమాల్లో ”గేమ్ ఛేంజర్( Game Changer ) ఒకటి.ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను దీపావళికి ఇస్తున్నట్టు పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చేసారు.”జరగండి” అనే ఫస్ట్ సింగిల్ ను దీపావళి కానుకగా ఒక రోజు ముందు కానీ లేదంటే పండుగ రోజునే రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తుంది.అందుకే ఈ సాంగ్ ఎప్పుడు వస్తుందా అని విట్నెస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు.ఇప్పటికే ఈ సాంగ్ సూపర్ హిట్ అని అంత ఫిక్స్ అయ్యారు.కానీ శంకర్ సాంగ్స్ ఎలా ఉంటాయో తెలిసిన వారంతా ఈ సాంగ్ లో ఉండే గ్రాండ్ విజువల్స్ కోసం రామ్ చరణ్ ప్రజెన్స్ కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.చూడాలి ట్రీట్ ఎంత సాలిడ్ గా ఉంటుందో.