సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ లు షూటింగ్లకు కొత్త గ్యాప్ దొరికితే చాలు వెకేషన్లు తిరుగుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.ఇంకొందరికి హీరో హీరోయిన్లు వారికి నచ్చిన పనులు చేస్తూ ఉంటారు.
అనగా హార్స్ రైడ్,బైక్ రైడ్ ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు ఎంజాయ్ చేస్తూ ఉంటారు.కాగా సెలబ్రిటీలు కేవలం వెకేషన్ లు మాత్రమే కాకుండా అప్పుడప్పుడు స్పోర్ట్స్ రేసింగ్ గేమ్స్ కూడా ఇష్టపడుతూ ఉంటారు.
అలాగే ఎక్కడైనా స్పోర్ట్స్ కి సంబంధించిన ఆటలు పాటలు సాగుతున్నాయంటే వెంటనే వీక్షించడానికి అక్కడికి వెళుతూ ఉంటారు.
తాజాగా హైదరాబాదులో జరిగిన ఇండియన్ రేసింగ్ లీగ్ పోటీలను చూడటం కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,ఆయన సతీమణి ఉపాసన, అలాగే హీరో అక్కినేని నాగార్జున కలిసి పాల్గొన్నారు.
హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్ సమీపంలో ఇండియన్ రేసింగ్ లీగ్ విజయవంతంగా ముగిసింది.శనివారం ప్రాక్టీస్ సెషన్స్ అనంతరం ఆదివారం మెయిన్ రేసులు జరిగాయి.ఈ పోటీలలో ఇండియాలోని అన్ని ప్రధాన నగరాలకు చెందిన టీమ్స్ పోటీలో పాల్గొన్నాయి.అయితే ఓవరాల్ ఛాంపియన్ షిప్ లో కేరళకు చెందిన కొచ్చి టీమ్ విజేతగా నిలిచింది.టైటిల్ విజేతగా నిలిచిన కొచ్చి టీమ్ కి 417.5 పాయింట్స్ రాగా 385 పాయింట్స్ తో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ రెండో స్థానం కైవసం చేసుకుంది.
ఈ రేసింగ్ లీగ్ పోటీలలో రామ్ చరణ్ దంపతులు, నాగచైతన్య సందడి చేశారు.రామ్ చరణ్ సతీసమేతంగా హాజరై పోటీలను ఎంజాయ్ చేశాక.రేసింగ్ కార్స్ పక్కన నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు.ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.హైదరాబాద్ లో ఇండియన్ రేసింగ్ లీగ్ జరగడం ఆనందంగా ఉంది.కొచ్చి లీడింగ్ లో ఉందని తెలిసింది.
కానీ, నా ఫేవరేట్ టీమ్ మాత్రం హైదరాబాదే అని తెలిపాడు చెర్రీ.అనంతరం నాగచైతన్య మాట్లాడుతూ.
కాలేజ్ రోజుల్లో ఈ స్ట్రీట్స్ లో కార్ లో తిరుగేవాళ్ళం.ఇప్పుడు ఇక్కడే స్ట్రీట్ రేసింగ్ జరుగుతుండటం అద్భుతంగా ఉందని తెలిపాడు.
ప్రస్తుతం రామ్ చరణ్, ఉపాసన, నాగచైతన్యలు రేసింగ్ లో సందడి చేసిన వీడియోస్, ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి.