ఏయ్.. ఏం చెబుతున్నావ్ డార్లింగ్.. షోలో ప్రభాస్ రచ్చరచ్చ చేశారుగా!

స్టార్ హీరో ప్రభాస్ చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా ఆ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సంచలనాలు సృష్టించాయి.బాహుబలి, బాహుబలి2 సినిమాల కోసం ఐదేళ్ల సమయం కేటాయించిన ప్రభాస్ కు ఆ సినిమాల ద్వారా ఏ రేంజ్ లో పేరు వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

 Unstoppable Show Prabhas Episode Glimpse Details Here Goes Viral , Unstoppable-TeluguStop.com

ఈ సినిమాల ద్వారా అటు ప్రభాస్ పేరు ఇటు రాజమౌళి పేరు బాక్సాఫీస్ వద్ద మారుమ్రోగింది.

పాన్ ఇండియా స్టార్ హీరో అయినప్పటికీ ఒదిగి ఉండే తత్వం ప్రభాస్ ను అభిమానులకు మరింత దగ్గర చేసింది.

తాజాగా అన్ స్టాపబుల్ షో ప్రభాస్ ఎపిసోడ్ గ్లింప్స్ రిలీజ్ కాగా ప్రభాస్ చేసిన రచ్చ చూసి షాకవ్వడం ఫ్యాన్స్ వంతమవుతోంది.స్పెషల్ గ్లింప్స్ పేరుతో రిలీజ్ చేసిన ఈ వీడియోలో బాలయ్య స్టైల్ గా కళ్లజోడును పైకి ఎగరేస్తూ ప్రేక్షకులకు తనలోని కొత్త బాలయ్యను పరిచయం చేశారు.

బాహుబలి మీట్స్ బాలయ్యఅనే క్యాప్షన్ తో ఆహా నిర్వాహకులు ఈ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచేశారు.కూల్ గా షోలోకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ అభిమానులకు ఫ్లైయింగ్ కిస్ లు ఇచ్చి ఆశ్ఛర్యపరిచారు.“ఏయ్.ఏం చెబుతున్నావ్ డార్లింగ్” అనే డైలాగ్ తో ప్రభాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడం గమనార్హం.

ఈ గ్లింప్స్ కు సోషల్ మీడియాలో వస్తున్న రెస్పాన్స్ కూడా మామూలుగా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.అధికారికంగా డేట్ ను ప్రకటించకపోయినా ఈ నెల 16వ తేదీన ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే అవకాశం అయితే ఉందని తెలుస్తోంది.

ప్రభాస్, గోపీచంద్ స్నేహం గురించి, ప్రభాస్ పెళ్లి గురించి ఈ షో ద్వారా స్పష్టత రానుంది.అభిమానులు సోషల్ మీడియా ద్వారా అడిగిన ఎన్నో ప్రశ్నలకు కూడా ప్రభాస్ ఈ షో ద్వారా సమాధానం ఇచ్చారని సమాచారం అందుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube