యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్( Young Tiger Jr.NTR ) సినీ కెరీర్ లో హిట్లు ఫ్లాపులు సమానంగా ఉన్నాయి.అయితే నిన్ను చూడాలని సినిమా నుంచి ఆర్.ఆర్.ఆర్ వరకు హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా తారక్ కెరీర్ ను కొనసాగించారు.తారక్ తన సినిమా ఫ్లాపైనా ఏరోజు ఏ డైరెక్టర్ ను విమర్శించలేదు.
ఈ రీజన్ వల్లే రాజమౌళికి( Rajamouli ) యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం అని సమాచారం అందుతోంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో స్టూడెంట్ నంబర్ 1, సింహాద్రి, యమదొంగ, ఆర్.ఆర్.ఆర్( Student Number 1, Simhadri, Yamadonga, R.R.R ) సినిమాలు తెరకెక్కగా ఈ నాలుగు సినిమాలు ఒక సినిమాను మించి మరొకటి సక్సెస్ సాధించడం గమనార్హం.ఎన్టీఆర్ తో మరిన్ని ప్రాజెక్ట్ లు తెరకెక్కించాలని జక్కన్న భావిస్తున్నా ఆ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావడం సాధ్యమవుతుందో లేదో చూడాల్సి ఉంది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గత రెండు సంవత్సరాలుగా దేవర ( Devara )సినిమాకే పూర్తిస్థాయిలో పరిమితమయ్యారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడానికి మరో నెలరోజుల సమయం మాత్రమే ఉంది.యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు.
డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన బ్లేమ్ చేయకుండా ఉండటం గొప్ప లక్షణమని ఆ లక్షణం తారక్ కు ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తారక్ ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా ఆ ప్రాజెక్ట్ లకు అనుగుణంగా తన లుక్ ను మార్చుకుంటున్నారు.యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం పరిమితంగా యాడ్స్ లో నటిస్తుండగా ఆ యాడ్స్ తారక్ బ్రాండ్ ఇమేజ్ ను మరింత పెంచుతున్నాయి.తారక్ ఆస్తుల విలువ సైతం ఒకింత భారీ స్థాయిలోనే ఉందని సమాచారం అందుతోంది.
దేవరతో తారక్ ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ను మెప్పిస్తారో చూడాల్సి ఉంది.