ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాలో కార్తికేయ ఓ NIA ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.
కాగా ఈ సినిమాను పూర్తిగా క్రైమ్ థ్రిల్లర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో కార్తికేయ ఖచ్చితంగా హిట్ కొడతాడని అందరూ అనుకుంటున్నారు.అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్‌డేట్ తాజాగా ప్రేక్షకులకు తెలిపింది చిత్ర యూనిట్.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసినట్లు చిత్ర యూనిట్ తెలిపింది.తాము అనుకున్న సమయంలో ఈ షూటింగ్ పూర్తి కావడం తమకు సంతోషాన్ని కలిగించిందని చిత్ర యూనిట్ అంటోంది.
ఇక ఈ సినిమాలో కార్తికేయ పాత్ర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుందని, అభిమానులు ఆయన నుండి ఏం కోరుకుంటున్నారో, అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.ఇప్పటికే ఈ సినిమా టైటిల్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.
గతంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాజా విక్రమార్క’ అనే టైటిల్‌ను మరోసారి కార్తికేయ వాడుకొస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయని వారు అంటున్నారు.
కాగా ఈ సినిమాలో కార్తికేయ సరికొత్త లుక్‌తో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తాడని, తాన్య రవిచింద్రన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.
డెబ్యూ డైరెక్టర్ శ్రీ సరిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, రమారెడ్డి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.కాగా ఈ సినిమాలో అలనాటి నటుడు సుధాకర్ ఓ కీలక పాత్రలో నటిస్తుండగా, ప్రశాంత్ కె విహారి సంగీతం అందిస్తున్నారు.
అయితే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారనే విషయంపై చిత్ర యూనిట్ ప్రకటన చేయాల్సి ఉంది.