స్టాండప్ కామెడీ చేస్తానంటోన్న రాజ్ తరుణ్

టాలీవుడ్‌లో యంగ్ హీరో రాజ్ తరుణ్ తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.వరుసగా హిట్ చిత్రాలను తన కెరీర్‌లో నమోదు చేసుకున్న ఈ హీరో, ఆ తరువాత సినిమాల ఎంపికలో తప్పటడుగులే వేస్తూ వస్తున్నాడు.

 Raj Tarun New Movie Title Standup Rahul, Raj Tarun, Standup Rahul, Tollywood New-TeluguStop.com

దీంతో వరుసగా ఫెయిల్యూర్ చిత్రాలను తన ఖాతాలో వేసుకుంటూ వెనకబడిపోయాడు రాజ్ తరుణ్.కాగా చేసే ప్రతి సినిమా హిట్ అవ్వాలని కోరుతూ వస్తున్నా, అది బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలవుతూ వస్తున్నాయి.

ఈ క్రమంలో రాజ్ తరుణ్ ప్రస్తుతం నటిస్తున్న లేటెస్ట్ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను సదరు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.ఈ సినిమాకు ‘స్టాండప్ రాహుల్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది.

ట్యాగ్‌లైన్‌గా ‘కూర్చుంది చాలు’ అనే ఇంట్రెస్టింగ్ క్యాప్షన్‌ను వాడటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.ఇక ఈ సినిమాలో రాజ్ తరుణ్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.

కాగా ఈ సినిమాను మోహన్ వీరంకి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా, స్వీకర్ అగస్తి సంగీతం అందిస్తున్నాడు.

పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ మూవీగా ఈ సినిమా రానుండగా, ఇందులో రాజ్ తరుణ్ పాత్ర చాలా ఫన్నీగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని రాజ్ తరుణ్ చూస్తున్నాడు.

మరి ఈ సినిమాతో రాజ్ తరుణ్ హిట్ కొడతాడా లేడా అనేది చూడాలి.కాగా ఈ సినిమాలో వర్షా బొల్లమ్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

ఈ సినిమాను వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube