హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్ లో ఒక ఉత్కంఠ భరితమైన సన్నివేశం చోటుచేసుకుంది.రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయిన ఒక ప్రయాణికుడు ప్రమాదవశాత్తు కింద పడ్డాడు.
అయితే ఈ క్రమంలో ట్రైన్ కిందకు పడిపోయిన అతడిని అక్కడి రైల్వే ప్రొటేషన్ ఫోర్స్ పోలీస్ సకాలంలో స్పందించి ప్రాణాలకు తెగించి మరీ ఆ ప్రయాణికుడిని కాపాడాడు.రన్నింగ్ బస్సు,రన్నింగ్ ట్రైన్స్ ఎక్కి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అంటూ అధికారులు ఎన్ని హెచ్చరికలు చేస్తున్నప్పటికీ ప్రయాణికులలో మాత్రం ఎలాంటి మార్పు కనపడడం లేదు.
ఇలా రన్నింగ్ ట్రైన్ ఎక్కి ప్రాణాలకు మీదకు తెచ్చుకున్న అతగాడిని పోలీసు కాపాడిన తీరు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ ఘటనకు సంబందించిన దృశ్యాలు అన్ని కూడా అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ కావడం తో ఈ దృశ్యాలు బయటకొచ్చాయి.
నిజంగా సకాలంలో పోలీస్ స్పందించి ప్రాణాలకు తెగించి మరి ఆ ప్రయాణికుడిని కాపాడడం తో అతడు ఊపిరి పీల్చుకున్నాడు.
పోలీసు గనుక సమయామానికి రాకపోతే మాత్రం ఆ ప్రయాణికుడి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవి.
పెను ప్రమాదం నుంచి బయటపడడం తో ఆ ప్రయాణికుడు ఊపిరి పీల్చుకున్నాడు.