కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తీవ్రంగా మండిపడ్డారు.బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తున్నారన్న ఆయన సభలో బీసీలను అవమానించేలా రాహుల్ మాట్లాడారని విమర్శించారు.
ఈ క్రమంలో బీసీలకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు.ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా రాలేదని పేర్కొన్నారు.
బీసీలకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని చెప్పారు.బీసీలకు రాజ్యాధికారం కల్పించాలన్న లక్ష్మణ్ బీజేపీ హయాంలో బీసీని ప్రధానిని చేశామని తెలిపారు.
ఈ తరహాలోనే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని స్పష్టం చేశారు.