కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అగ్రరాజ్యం అమెరికాలో పర్యటించనున్నారు.ఈనెల 31 నుంచి పది రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది.
ఇందులో భాగంగా జూన్ 4వ తేదీన అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ లో ఐదు వేల మంది ఎన్ఆర్ఐలతో రాహుల్ గాంధీ ర్యాలీ నిర్వహించనున్నారు.వాషింగ్టన్, కాలిఫోర్నియాలో ప్యానల్ డిస్కషన్స్ కు హాజరుకానున్నారు.
తరువాత స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.