ఎంత పెద్ద పామో.. 18 అడుగులు ఉంది ఆ పైథాన్

పాములు చాలా మంది చూసే ఉంటారు.వాటి గురించి వినే ఉంటారు.

 Python Found In Lalpur Village Of Laksar Deails, 18 Feet Python, Python, Lalapur-TeluguStop.com

ముఖ్యంగా నాగు పాము అంటే చాలా మందికి చచ్చేంత భయం ఉంటుంది.నాగు పాము పగబడుతుందని భయపడుతుంటారు.

శ్వేత నాగుకు చాలా శక్తులు ఉంటాయని గజ గజ వణికి పోతుంటారు.కొండ చిలువ గురించి విన్నా చాలా మంది భయపడతారు.

పాముల్లో వేల రకాలు ఉన్నాయి.అందులో చాలా కొన్ని జాతుల పాముల్లో మాత్రమే విషం ఉంటుంది.

ఇంకొన్ని జాతుల పాముల్లో కొంత విషం ఉన్నా.అది ప్రాణాలను తీసే స్థాయిలో ఉండదు.

అలాంటి పాములు కాటు వేస్తే మూర్చ పోవడం, దురద రావడం, దద్దుర్లు, మగతగా అనిపించడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి.

అలాంటి జాతి పాముల విషం శరీరంలో చాలా కొద్ది సమయం మాత్రమే ఉంటుంది.

మన శరీరంలోని రోగ నిరోధక శక్తి ఆ విషాన్ని నిలువరిస్తుంది.దాని వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదు.

చాలా పాముల జాతుల్లో విషం లేకపోయినా పాములు అనగానే చాలా మంది వణికిపోతుంటారు.భయంతో వాటిని కొట్టి చంపేస్తుంటారు.

ఇలా పాములను కొట్టి చంపవద్దని, చాలా పాములు కాటు వేసినా ఎలాంటి ప్రమాదం జరగదని అధికారులు అవగాహన కల్పిస్తున్నా జనాలు పట్టించుకోవడం లేదు.

Telugu Feet Python, Anaconda, Laksar, Lalapur, Python, Snake, Uday Singh, Uttara

పాములు కనపడగానే అవి తమను కాటు వేస్తాయన్న భయంతో వాటిని కర్రలతో కొట్టి చంపేస్తారు.నిజానికి పాములంటే మనుషులకు ఎంత భయం ఉంటుందో అంతకంటే ఎక్కువ భయం మనుషులంటే పాములకు ఉంటుంది.ఉత్తరాఖండ్ లక్సర్ లోని లాల్ పూర్ గ్రామంలో 18 అడుగుల పైథాన్ కనిపించింది.

పొలంలో దాని దారిన అది పోతోంది.అదే సమయంలో పొలానికి వచ్చిన ఉదయ్ సింగ్ దానిని చూసి భయంతో గ్రామస్థులకు చెప్పగా… వారు అధికారులకు సమాచారం ఇచ్చారు.

వారు వచ్చి ఆ భారీ కొండ చిలువను బంధించి అడవిలో వదిలి పెట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube