టాలీవుడ్ ఇండస్ట్రీకి నైజాం ఏరియా( Nizam Area ) ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నైజాంలో 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి.
అయితే పుష్ప 2 సినిమాకు( Pushpa 2 ) నైజాం ఏరియాలో 100 కోట్ల డీల్ దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.మైత్రీ నిర్మాతలు సొంతంగా విడుదల చేసినా 100 కోట్ల రూపాయల బిజినెస్ లెక్కలతో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారని సమాచారం.
ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు విడుదలైనా నైజాంలో 100 కోట్ల రూపాయల బిజినెస్ జరగలేదు.ప్రభాస్ కల్కి సినిమాకు 80 కోట్ల రూపాయల రేంజ్ లో నైజాం డీల్ క్లోజ్ అయినట్టు వార్తలు వినిపించాయి.100 కోట్ల రూపాయలకు పుష్ప 2 నైజాం హక్కులు అమ్ముడైతే కనీసం 110 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.
టాలీవుడ్ స్టార్ హీరోలలో బన్నీ( Bunny ) నంబర్ వన్ కావడానికి ఎంతో సమయం పట్టదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బన్నీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడే దక్కుతోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.అల్లు అర్జున్ రెమ్యునరేషన్( Allu Arjun Remuneration ) పరంగా, సోషల్ మీడియా ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా కూడా ఇతర హీరోలతో పోల్చి చూస్తే టాప్ లో ఉన్నారని తెలుస్తోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత సినిమా విషయంలో కూడా కన్ఫ్యూజన్ తొలగిపోయింది.గుంటూరు కారం మూవీ ఆశించిన రేంజ్ లో హిట్ కాకపోయినా త్రివిక్రమ్ టాలెంట్ ను నమ్మి బన్నీ ఛాన్స్ ఇస్తున్నారని తెలుస్తోంది.బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని అభిమానులు కోరుకుంటున్నారు.బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ 2026లో విడుదలయ్యే ఛాన్స్ ఉంది.