పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా జేమ్స్ థియేటర్లలో విడుదలై రికార్డు స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే.పునీత్ పుట్టినరోజు కానుకగా ఈ నెల 17వ తేదీన జేమ్స్ సినిమా కర్ణాటక రాష్ట్రంలోని మెజారిటీ థియేటర్లలో విడుదలైంది.
చేతన్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా శ్రీకాంత్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించారు.మార్చి నెల 22వ తేదీ వరకు ఎక్కువ సంఖ్యలో థియేటర్లలో ఈ సినిమాను మాత్రమే ప్రదర్శించాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు.
పునీత్ సోదరులు ఇప్పటికే థియేటర్ లో జేమ్స్ సినిమాను చూశారు.అయితే పునీత్ భార్య అశ్విని మాత్రం ఈ సినిమాను థియేటర్ లో చూడలేదు.అశ్విని మాట్లాడుతూ ప్రేక్షకులు, జేమ్స్ యూనిట్ సినిమా చాలా బాగా వచ్చిందని చెబుతున్నారని `చెప్పుకొచ్చారు.ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్ ల గురించి పునీత్ తనతో చాలా విషయాలను పంచుకున్నాడని ఆమె వెల్లడించారు.
ఈ సినిమా కొరకు ఉపయోగించిన టెక్నాలజీకి సంబంధించిన విషయాలను సైతం పునీత్ తనతో పంచుకున్నారని ఆమె చెప్పారు.
జేమ్స్ మూవీ రిలీజ్ రోజున పునీత్ అభిమానులు నేత్రదానం, రక్తదానం చేశారని ఆమె వెల్లడించారు.
ఆరోజు పలు ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం కూడా జరిగిందని ఈ విధంగా అప్పూను మళ్లీ బ్రతికించారని ఆమె పేర్కొన్నారు.పీఆర్‌కే బ్యానర్ భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ఆమె అన్నారు.పీఆర్‌కే బ్యానర్ లో వచ్చిన అన్ని సినిమాలు సక్సెస్ సాధించకపోయినా మంచి ఔట్ పుట్ ఇవ్వగలిగామని ఆమె వెల్లడించారు.
పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా అయిన జేమ్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.యాక్షన్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులను ఈ సినిమా మరింత ఎక్కువగా ఆకట్టుకుంటోంది.పునీత్ గత సినిమాలను మించి కలెక్షన్లను సాధించడంతో పాటు కర్ణాటకలో కలెక్షన్ల విషయంలో జేమ్స్ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.