నడవలేని కూతురిని గొప్ప డ్యాన్సర్ ని చేసిన తల్లి.. ఈ తల్లీకూతుళ్ల సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

బిడ్డకు ఏదైనా కష్టం వస్తే తల్లి మనస్సు అస్సలు తట్టుకోలేదు.ప్రేరణ( prerana ) అనే ఆరు నెలల పాప ప్రమాదవశాత్తూ కింద పడిపోయి పక్షవాతానికి గురైంది.

 Prerana Inspirational Success Story Details Here Goes Viral In Social Media , Pr-TeluguStop.com

ఈ మాటలు విన్న తల్లి ఉజ్వల( Ujjwala Sahane ) సహానే బాధను ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు.ప్రేరణ నడవలేకపోవడంతో పాటు వినికిడి శక్తిని కోల్పోయింది.

డాక్టర్ పాప ఎప్పటికీ నడవలేదని చెప్పడంతో తల్లి ఉజ్వల, ఆమె భర్త ఆత్మహత్య శరణ్యం అని భావించారు.

ఆ తర్వాత ఉజ్వల హెలెన్ కిల్లర్( Helen Kille ) ఆత్మకథ చదివి ఆమె లైఫ్ గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవడంతో పాటు తన కూతురు కెరీర్ పరంగా ఒక్కో మెట్టు పైకి ఎదిగేలా చేశారు.వైద్యం, వ్యాయామాల సహాయంతో ప్రేరణ నెమ్మదిగా నడిచేలా చేసిన ఉజ్వల కూతురికి వినికిడి లోపం మాత్రం పోకపోవడంతో స్పీచ్ అండ్ ఇయరింగ్ ఇంపేర్డ్ స్కూల్ లో చేర్పించారు.ప్రేరణకు శాస్త్రీయ నృత్యంపై ఆసక్తి ఉందని తెలుసుకున్న తల్లి ఉజ్వల కూతురిని సాధన నృత్యాలయలో చేర్పించారు.

గురుజీ షమిత మహాజన్ ప్రేరణను మంచి నృత్యకారిణిని చేయాలని ఎంతో కష్టపడి ట్రైనింగ్ ఇచ్చారు.ప్రేరణ సైతం లీప్ రీడింగ్ ద్వారా గురూజీ చెప్పిన విషయాలను అర్థం చేసుకుని నృత్యంలోకి ఆరంగేట్రం ఇచ్చారు.ఆమె నృత్య ప్రదర్శన అందరినీ ఆశ్చర్యపరిచింది.చెవులు వినిపించకపోయినా ఒక్క తప్పు కూడా లేకుండా నాట్యకారిణిగా సత్తా చాటారు.ఆమె ఎంతోమంది ప్రశంసలను అందుకుంటున్నారు.తన కూతురి సక్సెస్ గురించి ఉజ్వల సహానే మాట్లాడుతూ బాధ, ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ప్రమాదకరంగా ఉంటాయని ప్రశాంతమైన హృదయంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు.

మన కోసం ఎక్కడో ఒక చోట ఒక ద్వారం తెరచుకుని ఉంటుందని ఆవేదన, ఆవేశాలతో ఆ ద్వారం దగ్గరకు చేరలేమని ఉజ్వల కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube