ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా ప్రతినిధి2 ట్రైలర్.. వైసీపీ నేతలు ఏం చేస్తారో?

ఇటీవల కాలంలో చాలావరకు సినిమాలలో పొలిటికల్ ను టచ్ చేస్తూ పొలిటికల్ ను ఉద్దేశిస్తూ పరోక్షంగా, ప్రత్యక్షంగా సన్నివేశాలు డైలాగులు ఉంటున్నాయి.ఇకపోతే త్వరలోనే ఎన్నికలు రాబోతున్న విషయం తెలిసిందే.

 Pratinidhi 2 Trailer, Pratinidhi 2, Trailer,tollywood, Tdp, Ycp,-TeluguStop.com

అందుకు అనుగుణంగా పొలిటికల్ టచ్ ఉన్న సినిమాలను విడుదల చేస్తున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.

ఎన్నికల ముందు తెలుగు దేశం బంధాలు ఉన్న జనాలు ఏం చేసినా దాని అర్థం పరమార్థం ఒక్కటే బాబు గారికి మేలు చేకూర్చాలి.జగన్( jagan ) ను టార్గెట్ చేయాలి.

Telugu Pratinidhi, Tollywood, Trailer-Movie

జగన్ పదే పదే ప్రస్తావించే టీవీ 5 చానెల్( TV 5 channel ) లో జర్నలిస్ట్ గా పని చేస్తున్న మూర్తి దర్శకుడిగా మారి చేస్తున్న సినిమా ప్రతినిధి 2( Pratinidhi 2 ).చంద్రబాబు కొడుకు వరుస అయిన నారా రోహిత్ ఇందులో హీరోగా నటిస్తున్నారు.ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటేనే తెలుస్తోంది.కేవలం ఎన్నికల నేపథ్యంలో యాంటీ జగన్ ప్రచారానికి తాము కూడా ఒక అస్త్రాన్ని అందించాలనే ఆలోచన తప్ప మరోటి లేదని చెప్పాలి.

కూరగాయలు అమ్మిన మీరు కోటీశ్వరులు అయితే మీతో అమ్మిన వారంతా అలాగే వుండిపోయారన్న డైలాగుతో ట్రైలర్ స్టార్ట్ అవుతుందీ.అసలు అదే పెద్ద తప్పు.

Telugu Pratinidhi, Tollywood, Trailer-Movie

టీడీపీ( TDP ) అధినేత స్టార్ట్ చేసింది రెండు ఎకరాలతోనే కదా? మరి ఆయనతో స్టార్ట్ చేసిన వాళ్లంతా కోట్లకు పడగలెత్తలేదు.అలాగే టీడీపీ స్ట్రాంగ్ మద్దతుదారు పచ్చళ్లు అమ్మి పదివేల వేల కోట్లకు పడగలెత్తారు.మిగిలిన పచ్చళ్ల వ్యాపారులు అలా కాలేదు కదా?జగన్ కు ఒక చాన్స్ ఇవ్వడం, వైఎస్సార్ కోసం అభిమానులు చనిపోవడం, పథకాలు, ఇలా ఒకటి కాదు, ట్రైలర్ లో వేసిన కట్ లు షాట్ లు అన్నీ జగన్ పై ప్రయోగించిన అస్త్రాలే.ఒక జర్నలిస్ట్ సినిమా తీస్తే కాస్తయినా న్యూట్రల్ గా ఉంటుందని, లేదా రెండు వైపులా విమర్శలు ఎక్కు పెడతారని కొద్ది మంది అయినా ఆశిస్తారు.

కానీ ట్రైలర్ చూస్తే ఒక జర్నలిస్ట్ తీసినట్లు కాకుండా, ఒక పార్టీ సింపతైజర్ తీసినట్లు కనిపిస్తోంది.మొత్తానికి మాత్రం ఏపీ సీఎం జగన్ ను టార్గెట్ చేసేలా ప్రతినిధి2 ట్రైలర్ ఉంది అనే చెప్పాలి.

ఈ టైలర్ పై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube