Prashanth Neel : ప్రశాంత్ నీల్ కు అలాంటి సమస్య ఉందా.. సినిమాలన్నీ డార్క్ గా ఉండటానికి కారణాలివేనా?

దర్శకుడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు దర్శకత్వం వహించినది కేవలం మూడు సినిమాలే అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్నారు.

 Prashanth Neel Gives Clarity On Why His Movies In Dark Frames-TeluguStop.com

మొదట కన్నడలో ఉగ్రం సినిమాతో మంచం గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ ఆ తర్వాత కేజిఎఫ్ పార్ట్ వన్,పార్ట్ టు సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు సంపాదించుకున్నారు.ఇకపోతే ప్రశాంత్ నీల్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా సలార్.

పాన్ ఇండియా హీరో ప్రభాస్( Prabhas ) హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Telugu Salaar, Dark Frames, Kollywood, Prabhas, Prashanth Neel, Tollywood, Yash-

ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమా విడుదల అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంటే బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించడం ఖాయం అని సినీ విశేషకులు అభిప్రాయపడుతున్నారు.అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్.ఆ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలని తెలిపాడు.ప్రశాంత్ నీల్ సినిమాలన్నీ డార్క్ ఫ్రేమ్స్ లోనే ఉంటాయి.ఎక్కువ కలర్స్ కనపడవు.

దీనిపై సోషల్ మీడియాలో ట్రోల్స్ కూడా బాగా వచ్చాయి.ఇప్పుడు వచ్చే సలార్ కూడా డార్క్ గానే ఉండబోతుంది.

అయితే దీనికి ఒక కారణం ఉందని తాజా ఉంటర్వ్యూలో చెప్పాడు ప్రశాంత్ నీల్.

Telugu Salaar, Dark Frames, Kollywood, Prabhas, Prashanth Neel, Tollywood, Yash-

ఈమేరకు ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ.నాకు OCD ( Obsessive compulsive disorder ) సమస్య ఉంది.

నాకు ఏదైనా ఎక్కువ కలర్స్ ఉంటే నచ్చదు.అందుకే నా సినిమాలు అలా అంటాయి.

నా పర్సనల్ థాట్స్ అక్కడ స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి.అంతే కానీ నా సినిమాలకు ఒకదానికొకటి సంబంధం లేదు అని క్లారిటీ ఇచ్చారు.

అయితే ఈ OCD ఉన్నవాళ్లు కేవలం ప్రతీది క్లీన్ గా ఉండాలి.చేసింది రిపీట్ గా చేసే సమస్యలే కాదు, డిఫరెంట్ ఆలోచనలు, కలర్స్ కి సంబంధించి ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి.

తాజాగా ఆయన చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో కేజీఎఫ్ , సలార్ సినిమాలకు ఎలాంటి కనెక్షన్ లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చాడు ప్రశాంత్ నీల్ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube