తెలంగాణ సచివాయంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.ఈ మేరకు ఈనెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇందులో భాగంగా అన్ని గ్రామాలు, మున్సిపల్ వార్డులో సభలు నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభలను నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకోనున్నారు.
ఈ క్రమంలోనే ప్రజాపాలనపై కలెక్టర్లకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు.