టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ రెమ్యునరేషన్ 100 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉంది.ప్రభాస్ డిమాండ్ చేస్తే 200 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకాడరు.
అలాంటి ప్రభాస్ ఏకంగా 21 కోట్ల రూపాయలు అప్పు చేయడం హాట్ టాపిక్ అవుతోంది.ప్రాపర్టీ పెట్టి ప్రభాస్ ఈ రేంజ్ లో లోన్ తీసుకోవడం హాట్ టాపిక్ అవుతోంది.
ప్రభాస్ లోన్ తీసుకోవాల్సిన అవసరం ఏముందనే చర్చ కూడా జరుగుతోంది.
వాస్తవానికి సాహో, రాధేశ్యామ్ సినిమాలు ప్రభాస్ సొంత సినిమాలు అనే సంగతి తెలిసిందే.
సాహో ఫ్రెండ్స్ బ్యానర్ లో తెరకెక్కగా రాధేశ్యామ్ మూవీ గోపీకృష్ణా మూవీస్ బ్యానర్ లో తెరకెక్కింది.భారీ బడ్జెట్లతో తెరకెక్కిన ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా నిర్మాతలకు నష్టాలను మిగిల్చాయి.
అయితే ప్రభాస్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు క్రేజ్, పాపులారిటీ ఉన్న దర్శకులే దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాలపై అంచనాలుపెరిగాయి.
సాహో, రాధేశ్యామ్ సినిమాలు ఫ్లాపైన సమయంలో ప్రభాస్ తనుకున్న పారితోషికంలో చాలా మొత్తం వెనక్కు ఇచ్చేశారు.
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలకు భారీగానే రెమ్యునరేషన్లు తీసుకుంటున్నా సినిమాలు పూర్తైతే మాత్రం పూర్తి పేమెంట్ అందుతుంది.ఈ రీజన్స్ వల్లే ప్రభాస్ ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ లో 21 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ భారీ మొత్తంలో అప్పు తీసుకున్నా ఆ అప్పును తక్కువ సమయంలోనే తీర్చేస్తాడని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు.ఏడాదికి రెండు లేదా మూడు సినిమాలు విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న ప్రభాస్ జక్కన్న డైరెక్షన్ లో మరో సినిమాలో నటించాలని అభిమానులు భావిస్తున్నారు.ప్రభాస్ కు ప్రేక్షకులలో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా ఆయనకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.