భార్య కుటుంబ సభ్యులపై విష ప్రయోగం..అత్త మృతి..!

భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆమె కుటుంబ సభ్యులపై పగను పెంచుకున్న భర్త ( husband )ఏకంగా ఆ కుటుంబాన్ని అంతం చేయాలని విష ప్రయోగం చేశాడు.ముందు అత్తను చంపేశాడు.

 Poison Experiment On Wife's Family Members Aunt Died , Family Members , Aunt D-TeluguStop.com

ఆ తర్వాత మిగిలిన కుటుంబ సభ్యుల అవయవాలు పనిచేయకుండా చేశాడు.అయితే ఈ తతంగాన్ని లండన్ లో ఉండి నడిపించాడు.

ఈ ఘటన హైదరాబాద్లోని మియాపూర్ లో తాజాగా వెలుగులోకి వచ్చింది.ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ మియాపూర్ లోని గోకుల్ ప్లాట్స్ లో హనుమంతరావు, ఉమామహేశ్వరి( Hanumantha Rao, Umamaheswari ) అనే దంపతులు నివాసం ఉంటున్నారు.

జులై 5న ఉమామహేశ్వరి అకస్మాత్తుగా మరణించింది.అందరూ కూడా ఆమె అనారోగ్యం కారణంగా మృతి చెందిందని భావించారు.

అయితే హనుమంతరావు తో పాటు ఆయన ముగ్గురు పిల్లల కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయాయి.కుటుంబ సభ్యులందరికీ ఈ రుగ్మత ఒక్కసారిగా బయటపడటంతో కుటుంబ సభ్యులంతా భయాందోళనకు గురయ్యారు.

Telugu Gokul Plots, Hanumantha Rao, Hyderabad, Latest Telugu, Miyapur, Umamahesw

అందరూ వైద్య పరీక్షలు( Medical tests ) చేయించుకుంటే షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.శరీరంలో విష ప్రయోగం జరగడం వల్ల ఇలా జరిగిందని వైద్యులు నిర్ధారించారు.వెంటనే హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది.పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తే అల్లుడు అజిత్ కుమార్( Ajith Kumar ) ఈ తతంగానికి సూత్రధారి అని తేలింది.

వివరాల్లోకెళితే.హనుమంతరావు కుమార్తె డాక్టర్ శిరీష కు, అజిత్ కుమార్ అనే సాఫ్ట్వేర్ కు 2018 లో వివాహం అయింది.

ఈ దంపతులు ఉద్యోగరీత్యా లండన్లో స్థిరపడ్డారు.ఈ దంపతులకు ఒక కుమార్తె సంతానం.

అయితే వీరి మధ్య విభేదాలు తలెత్తడంతో డాక్టర్ శిరీష లండన్ లోని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అప్పటినుండి ఈ దంపతులు వేరుగా ఉంటున్నారు.

Telugu Gokul Plots, Hanumantha Rao, Hyderabad, Latest Telugu, Miyapur, Umamahesw

అజిత్ తన భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై కోపం పెంచుకుని వారందరినీ చంపేయాలని అనుకున్నాడు.తన వద్ద పనిచేసే వినోద్ కుమార్, హైదరాబాదులో ఉన్న స్నేహితులు భవాని శంకర్, అశోక్, గోపీనాథ్, పూర్ణచంద్రరావు లతో కలిసి కుట్ర పన్నాడు.అదే సమయంలో సోదరుడి వివాహం కోసం లండన్ నుండి శిరీష హైదరాబాద్ వచ్చింది.ఆమె కదలికలను ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు గోకుల్ ప్లాట్స్ వాచ్మెన్ కుమారుడైన రమేష్ కు కొంత నగదును ఇచ్చాడు.

పసుపు, కారం లాంటి శాంపిల్ ప్యాకెట్లలో గుర్తు తెలియని విషం కలిపి డెలవరీ బాయ్ సాయంతో ఇంటికి పంపించాడు.వాటిని వినియోగించిన హనుమంతరావు కుటుంబంలో ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు.

జులై 5న ఉమామహేశ్వరి మృతి చెందిన తర్వాత శిరీష ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా పెట్టారు.సీసీటీవీ రికార్డులను పరిశీలించగా వాచ్మెన్ కుమార్రైన రమేష్ వ్యవహార శైలిపై అనుమానంతో విచారించగా అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube