కాల్పుల మోతలతో దద్దరిల్లిన అమెరికా....ముగ్గురి మృతి...!!!

అగ్ర రాజ్యం అమెరికా కాల్పుల మోతలతో దద్దరిల్లి పోతోంది.ఏ నిమిషంలో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలియక ప్రజలు భయాందోళనల మధ్య కాలం గడుపుతున్నారు.

 Philadelphia Shooting: 3 Killed, 11 Injured In South Street Gunfire,philadelphia-TeluguStop.com

బయటకు వస్తే తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అనే సందేహం అందరిలో గుబులు రేపుతోంది.అందరూ భయపడుతున్నట్టుగానే అమెరికాలో రోజుకో ప్రాంతంలో తుపాకుల మోతలు మోగుతూనే ఉన్నాయి, అమాయకపు ప్రజలు ప్రాణాలను కోల్పోతూనే ఉన్నారు.

గడిచిన రెండు వారాలుగా

అమెరికాలో తుపాకుల కాల్పుల ఘటనలు రోజు విడిచి రోజు జరుగుతూనే ఉన్నాయి.ఈ ఘటనలో ఎంతో మంది చిన్నారులు, టీచర్స్, ప్రజలు, నర్సులు ఇలా ఎంతో మంది బలై పోయారు.

అలాగే ఓ స్కూల్ ఆవరణలో రెండు రోజుల క్రితం కాల్పులు జరిగిన ఘటన అమెరికాలో గన్ కల్చర్ ప్రభావాన్ని చెప్పకనే చెప్పింది.తాజాగా ఫిలడెల్ఫియాలోని సౌత్ స్ట్రీట్ లో వీకెండ్ లో భాగంగా వందలాది మంది విశాలమైన రోడ్లపైకి వచ్చి పార్టీలు చేసుకుంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా ప్రజలపై విరుచుకుపడ్డాడు.

విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పారిపోయాడు, ఊహించని విధంగా జరిగిన ఈ ఘటన అందరిని షాక్ కి గురిచేసింది.ఈ కాల్పుల ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, సుమారు 11 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

సామాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చిన ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.కాల్పులు జరిపిన వ్యక్తి అక్కడి నుంచీ తప్పించుకోవడంతో పోలీసులు దుండగుడిని గుర్తించే పనిలో పడ్డారు.ఇదిలాఉంటే అగ్ర రాజ్యం అమెరికాలో వరుసగా తుపాకు పేలుళ్ళ ఘటనలు బిడెన్ ప్రభుత్వానికి మాయని మచ్చగా మారాయి.19 మంది పిల్లలు మృతి చెందిన ఘటనలో గన్ కల్చర్ పై చట్టపరమైన మార్పులు తీసుకువస్తామని ప్రకటించిన తరువాత వరుసగా తుపాకి పేలుళ్ళ ఘటనలు జరగడం ఇది నాలుగో సారి కాగా ఇప్పటికి గన్ కల్చర్ నియంత్రణపై అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలకు ఉపక్రమించక పోవడం దారుణమని గన్ కల్చర్ వ్యతిరేక సంస్థలు విమర్శిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube