జనసేనతో పొత్తు : టీడీపీ వ్యూహాత్మక మౌనం ?

ఏపీలో రాజకీయాలన్నీ ఇప్పుడు పొత్తుల చుట్టూనే తిరుగుతున్నాయి.2024 ఎన్నికల్లో గెలిచేందుకు ఇప్పటి నుంచే అనుసరించవలసిన రాజకీయ వ్యూహాలపైన అన్ని పార్టీలు ప్రధానంగా దృష్టి సారించాయి.ముఖ్యంగా ఏపీ అధికార పార్టీ వైసీపీ మళ్లీ 2024 ఎన్నికల్లో గెలవకుండా చేయడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన ,బిజెపి తదితర పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి.అయితే ప్రతిపక్షాలన్నీ విడివిడిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తూ ఎన్నికలకు వెళ్లినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును అన్ని పార్టీలు చీల్చుతాయి అని, దాని కారణంగా మళ్ళీ ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంటుందనే విషయాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుర్తించారు .దీనిలో భాగంగానే ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకును చీల్చేందుకు తనకు ఇష్టం లేదని పరోక్షంగా పొత్తుల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు.దీంతో పాటు ఎప్పటి నుంచో తమతో పొత్తు పెట్టుకునేందుకు తహతహలాడుతున్న టిడిపితో పొత్తుకు తాము సిద్ధమేనని సంకేతాలు ఇచ్చారు .అయితే సీట్ల కేటాయింపు ప్రాధాన్యం తదితర అంశాలను పరోక్షంగా ప్రస్తావించింది టిడిపి కాస్త తగ్గితే మంచిది అంటూ వ్యాఖ్యానించారు.

 Tdp Leaders Silence On Janasena Aliance , Tdp, Janasena, Pavan Kalyan, Ysrcp, Ap-TeluguStop.com

అంతిమంగా బిజెపి టిడిపి జనసేన కూటమి కలిసి పోటీ చేయాలని పవన్ కోరుకుంటున్నారు.

ఈ విషయంలో బీజేపీ ఒప్పుకోకపోయినా టిడిపి తో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.ఇది ఇలా ఉంటే ఆ పార్టీ పెద్దలు ఎవరు పొత్తుల వ్యవహారం పై స్పందించడం లేదు.

కేవలం జనసేన మాత్రమే ఈ విషయంలో కంగారు పడుతున్నట్లుగా కనిపిస్తోంది.పొత్తుల వ్యవహారం పై ఇటీవల నిర్వహించిన మహానాడు కార్యక్రమంలో నూ టిడిపి మాట్లాడలేదు.

గతంలో వన్ సైడ్ లవ్ అంటూ జనసేన ను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడినా… ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటూ మాట్లాడుతూ ఉండడం పవన్ కు అసంతృప్తి కలిగిస్తోంది.ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీతో పొత్తు జనసేనకు అవసరం తప్ప జనసేన తో పొత్తు కోసం, వారు పెట్టే డిమాండ్లకు తలోగ్గేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఇష్టపడడం లేదు అన్నట్టుగా పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube