టాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖ హీరోయిన్లలో పాయల్ రాజ్ పుత్( Payal Rajput ) ఒకరు కాగా పాయల్ నటించిన పెద్ద సినిమాలలో వెంకీ మామ( Venky Mama Movie ) ఒకటి.పాయల్ నటించిన మంగళవారం సినిమా త్వరలో థియేటర్లలో రిలీజ్ కానుండగా ఈ సినిమాకు అజయ్ భూపతి దర్శకత్వం వహించారు.
ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోగా మంగళవారం మూవీ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పాయల్ వెంకీ మామ మూవీ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు.
తన సినీ కెరీర్ లో వెంకీమామ సినిమా ఒక బ్యాడ్ ఎక్స్ పీరియన్స్ అని ఆమె అన్నారు.వెంకీమామ సినిమాలో వయస్సుకు మించిన పాత్రలో తాను నటించానని పాయల్ రాజ్ పుత్ పేర్కొన్నారు.
వెంకీ మామ సినిమాలో తన లుక్ అస్సలు బాగోదని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు.వెంకటేశ్ తో( Venkatesh ) కలిసి నటించే ఛాన్స్ కావడంతో పాత్ర నచ్చకపోయినా ఆ మూవీ చేశానని పాయల్ అన్నారు.
వెంకీమామ సినిమాలో నటించినందుకు రిగ్రెట్ గా ఫీలవుతున్నానని పాయల్ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సినిమా నా సినీ కెరీర్ లో ఒక అనుభవ పాఠంగా నిలిచిపోతుందని పాయల్ పేర్కొన్నారు.పాయల్ వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇలాంటి కామెంట్ల వల్ల పాయల్ కెరీర్ కు నష్టమని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.
పాయల్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లను ఎంచుకుంటుండగా రాబోయే రోజుల్లో పాయల్ ఎలాంటి ప్రాజెక్ట్ లను ఎంచుకుంటారో చూడాల్సి ఉంది.మంగళవారం సినిమాకు( Mangalavaram Movie ) సీక్వెల్ తెరకెక్కుతుందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.మంగళవారం సినిమా హక్కులు 8 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని తెలుస్తోంది.