పవర్ స్టార్‌పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రి ఇవ్వడంతో ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ప్రస్తుతం ఆయన నటిస్తున్న పింక్ రీమేక్ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే.
కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ షూటింగ్ వీడియో సోషల్ మీడియాలో లీక్ అయ్యింది.
ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ యాక్షన్ మోడ్‌లో కనిపించాడు.
ఫైటింగ్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఓ పవర్ఫుల్ డైలాగ్ చెబుతూ కనిపించాడు.పవర్ఫుల్ లాయర్‌గా పవన్ యాక్టింగ్ ఈ సినిమాకు మేజర ప్లస్ కానుంది.
ఈ సీన్‌కు సంబంధించిన వీడియో లీక్ కావడంతో చిత్ర యూనిట్ అవాక్కయ్యారు.ఇలాంటి లీకులు జరగకుండా తాము ఎంత ప్రయత్నం చేసినా అవి జరుగుతూనే ఉన్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తుండగా స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు.అందాల భామ నివేదా థామస్ ఈ సినిమాలో లీడ్ హీరోయిన్గా నటిస్తోంది.
మరి ఈ లీక్ వీడియో గురించి చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.ఏదేమైనా ఫ్యాన్స్ కోసం పవన్ మరో పవర్ఫుల్ సినిమాను రెడీ చేస్తున్నట్లు ఈ వీడియో చూస్తే అర్ధం అవుతోంది.