పవన్‌ వల్ల హరీష్‌ శంకర్‌ అడ్డంగా బుక్‌ అయ్యాడు

గద్దలకొండ గణేష్‌ చిత్రంతో సక్సెస్‌ దక్కించుకున్న హరీష్‌ శంకర్‌ తదుపరి చిత్రాన్ని పవన్‌ కళ్యాణ్‌ తో చేయబోతున్న విషయం తెల్సిందే.వరుసగా సక్సెస్‌లు దక్కించుకున్న దర్శకుడు వెంటనే సినిమా చేస్తే ఆ సక్సెస్‌ల తాలూకు ఫలితాన్ని పొందవచ్చు.

 Pawan Kalyan, Harish Shankar, Harish Shankar Waiting For Pawan, Vakeel Saab, Vir-TeluguStop.com

కాని సక్సెస్‌ వచ్చిన చాలా కాలం వరకు కూడా సినిమా చేయకుంటే గత చిత్రాల సక్సెస్‌లను ప్రేక్షకులకు జ్ఞాపకం చేయాల్సి ఉంటుంది.కనుక సక్సెస్‌ వచ్చిన వెంటనే సినిమాలు చేయాలని దర్శకులు అయినా హీరోలు అయినా భావిస్తారు.

హరీష్‌ శంకర్‌ కూడా అదే అనుకుంటే ప్లాన్‌ రివర్స్‌ అయ్యింది.

దర్శకుడు హరీష్‌ శంకర్‌ తన తదుపరి చిత్రాన్ని పవన్‌ తో చేసేందుకు కమిట్‌ అయ్యాడు.

ప్రస్తుతం ఆ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌లో బిజీగా ఉన్నాడు.అయితే ఇప్పట్లో ఈ సినిమా మొదలయ్యే దాఖలాలు కనిపించడం లేదు.కరోనా మహమ్మారి కారణంగా సినిమా ఎప్పటికి మొదలు అయ్యేది తెలియకుండా ఉంది.మామూలుగా అయితే సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నుండి సెట్స్‌ పైకి వెళ్లాలని హరీష్‌ నిర్ణయించుకున్నాడు.

కాని ఇంకా ముందు వకీల్‌ సాబ్‌ మరియు విరూపాక్ష చిత్రాలు ఉన్నాయి.

ఆ రెండు సినిమాలు ఈ ఏడాది చివర్లో ప్రారంభం అయితే వచ్చే ఏడాది ప్రథమార్థం మొత్తం ఆ సినిమాలతోనే పవన్‌ కుస్తీ పట్టనున్నాడు.

ఈ రెండు సినిమాలు పూర్తి అయితే కాని హరీష్‌ శంకర్‌కు డేట్లు ఇవ్వలేడు.అంటే గద్దలకొండ గణేష్‌ విడుదలైన రెండున్నర మూడు సంవత్సరాల వరకు దర్శకుడు హరీష్‌ కొత్త సినిమాను విడుదల చేయలేడన్నమాట.

మొత్తానికి పవన్‌తో సినిమా కోసం ఆశ పడి దర్శకుడు హరీష్‌ శంకర్‌ అడ్డంగా బుక్‌ అయ్యాడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube