'గోదావరి జిల్లాల'లో 'జగన్, పవన్'లదే హవా...!!!!  

వచ్చే ఎన్నికల్లో గోదావారి జిల్లాలలో వార్ త్రీ సైడ్ అనుకున్నారు అందరూ కాని, అనూహ్య పరిణామాల నేపధ్యంలో ఇప్పుడు ఆ వార్ టూ సైడ్ అయ్యింది. టీడీపీ కి గోదావారి జిల్లా ప్రజలు హ్యాండ్ ఇవ్వనున్నారని ఇప్పటికే పలు సర్వేలు కూడా తేల్చేశాయి. అయితే తాజాగా లోకల్ సర్వే పేరుతో టీడీపీలో గుబులు రేపుతోంది. లోకల్ చానెళ్ళు సైతం గోదావరి జిల్లాలో సర్వేలు చేపట్టాయాట.

Pawan And YS Jagan Have Huge Fan Following In Godavari Districts-Janasena Party Pawan Ys Kalyan Janasena Tdp Which Is Popular Districts Ycp

Pawan And YS Jagan Have Huge Fan Following In Godavari Districts

చంద్రబాబు నాయుడు ఎన్ని తాయిలాలు ప్రకటించినా సరే అవేమీ కూడా టీడీపీకి ఓట్లు పడే స్థితిలో ఓటర్లు లేరని అంటున్నారు. ఈ సర్వేలకి సంభందించిన రిపోర్ట్ లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయట. పశ్చిమ ,తూర్పు గోదావరి జిల్లాలలో మొత్తం 34 స్థానాలు ఉన్నాయి అయితే వీటిలో దాదాపు 20 స్థానాలు వైసీపీ కైవసం కానున్నాయని,టీడీపీ కేవలం 7 స్థానాలకి పరిమితం కానున్నదని తెలుస్తోంది. ఇదిలాఉంటే జనసేన పార్టీ టీడీపీ తో పోటా పోటీగా 7 స్థానాలని గెలుచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు.

Pawan And YS Jagan Have Huge Fan Following In Godavari Districts-Janasena Party Pawan Ys Kalyan Janasena Tdp Which Is Popular Districts Ycp

ఇదిలాఉంటే మరో పక్క టీడీపీ కంటే కూడా గోదావరి జిల్లాలలో జనసేన హవా జోరుగా ఉందని అంటున్నారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో టీడీపీ సంఖ్యా బలం కంటే కూడా జనసేన బలం మరింత పెరిగే అవకాశం ఉందట. చంద్రబాబు ఓటర్లని ఆకర్షించడానికి ధర్మ పోరాట దీక్షలు చేసినా , నిరుద్యోగ బ్రుతి , ఫించను , ఇలా అన్నీ పెంచుకుంటూ పోతూ వ్యూహాలు రచించినా సరే గోదావరి ప్రజలు బాబు ని విశ్వసించే పరిస్థితిలో లేరని అంటున్నారు పరిశీలకులు..మరి గోదావరి జిల్లాల ప్రజల ఓట్ల కోసం బాబు ఎలాంటి వ్యూహాలు రచిస్తారో వేచి చూడాల్సిందే.