వైసిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.పవన్ ఆ స్థాయిలో వైసిపి లోని కాపు ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నా.
కొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు , ఎమ్మెల్యేలు స్పందించారు.అయితే పవన్ కు గట్టి స్థాయిలో కౌంటర్ అయితే వైసిపి నుంచి లేదు.
అయితే పవన్ దూకుడు పెంచుతుండడం, రాబోయే రోజుల్లో టిడిపి, జనసేన లో అధికారికంగా పొత్తు పెట్టుకునే ఆలోచనలో ఉండడం , ఇప్పటి నుంచే టిడిపి, జనసేన లు ఉమ్మడిగా తమ ప్రభుత్వంపై పోరాటాలు చేసేందుకు సిద్ధమవుతుండడం, తదితర అంశాలను వైసీపీ సీరియస్ గానే తీసుకుంది .దీంతో పవన్ కు చెక్ పెట్టే విధంగా వైసిపి కాపు ఎమ్మెల్యేలతో గట్టి కౌంటర్ ఇప్పించేందుకు సిద్ధమవుతోంది.ఈ మేరకు రాజమండ్రిలో ఈనెల 31వ తేదీన వైసిపి కాపు సామాజిక వర్గ ఎమ్మెల్యేలంతా భేటీ కాబోతున్నారు.ఈ సందర్భంగా కొద్ది రోజుల క్రితం పవన్ తమపై చేసిన వ్యాఖ్యలను ఖండించడంతో పాటు , తమ సామాజిక వర్గం జనసేన వైపు వెళ్ళకుండా, తగిన జాగ్రత్తలను తీసుకోబోతున్నారు.
ఈనెల 31న జరగబోయే సమావేశంలో జనసేన పైన , పవన్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, తమను అవమానకరంగా మాట్లాడడం పైన గట్టి వార్నింగ్ ఇవ్వాలని వైసీపీ కాపు ఎమ్మెల్యేలు తగిన వ్యూహంతో సిద్ధమవుతున్నారు.
2019 ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఎక్కువగా వైసీపీకి అండగా నిలిచింది .జనసేన అప్పట్లో పోటీలో ఉన్నా… వైసీపీ వైపు మొగ్గు చూపించడంతో అంతే స్థాయిలో జగన్ సైతం కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇస్తూనే వచ్చారు.అయితే ఇప్పుడు టిడిపి జనసేన కలిసి పొత్తు పెట్టుకుంటే కచ్చితంగా గెలుపు ఇబ్బంది అవుతుందనే టెన్షన్ జగన్ లోనూ కనిపిస్తోంది.
అందుకే ఇప్పుడు వైసిపి ఎమ్మెల్యేలతో కౌంటర్ ఇప్పించేందుకు రాజమండ్రి వేదికగా ఆ సామాజిక వర్గం వైసీపీ ఎమ్మెల్యేలంతా భేటీ అయ్యి తగిన నిర్ణయాలు తీసుకోబోతున్నారు.అలాగే పెద్ద ఎత్తున కాపు సామాజిక వర్గానికి చెందిన వారిని వైసీపీలో చేర్చుకుని పవన్ కు జలక్ ఇవ్వాలనే ఆలోచనలో వారు ఉన్నారట.
దీంతో ఈ సమావేశంపై రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.