దర్శకత్వంపై ఆసక్తి ఉందంటున్న జాతిరత్నాలు బ్యూటీ.. కానీ ఇప్పుడు కాదట?

దర్శకుడు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న తాజా చిత్రం లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్.ఈ సినిమాలో సంతోష్ శోభన్ సరసన జాతి రత్నాలు బ్యూటీ ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తోంది.

 Actress Faria Abdullah Special Interview About Like Share And Subscribe Movie F-TeluguStop.com

ఈ సినిమాను వెంకట్ బోయినపల్లి నిహారిక ఎంటర్టైన్మెంట్ తో కలిసి ఆముక్త క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.కాగా ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రస్తుతం ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగానే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఫరియా అబ్దుల్లా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

ఈ సందర్భంగా సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకు కూల్ గా సమాధానాలు చెప్పింది ఈ ముద్దుగుమ్మ.మరొక రెండేళ్లలో ఇలాగే ఉండాలి అన్న టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా అని యాంకర్ ప్రశ్నించగా.

ఆ విషయంపై స్పందించిన ఫరియా అబ్దుల్లా.రెండేళ్లు కాదు కానీ మరో ఐదేళ్లపాటు పాన్ వరల్డ్ లో ఉండాలని కోరుకుంటున్నాను అని తెలిపింది.

కొత్త సినిమాలు ఏమైనా చేస్తున్నారా అని అడగగా.

Telugu Faria Abdullah, Jathi Rathanalu, Share Subcribe, Santosh Shoban, Tollywoo

రవితేజ తో కలిసి రావణాసుర సినిమా చేస్తున్నాను.అలాగే తమిళంలో ఒక సినిమా హిందీలో ఒక సీరిస్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది ఫరియా అబ్దుల్లా.అలాగే దర్శకత్వం పై ఆసక్తి ఉందని చెప్పారు కదా ఎటువంటి సినిమాలు చేస్తారు అని యాంకర్ ప్రశ్నించగా.

నాకు హాట్ ఫిలిం అంటే చాలా ఇష్టమే అలాగే మ్యూజికల్ ఫిలిమ్స్ అంటే కూడా ఇష్టం.కానీ దర్శకత్వం ఇప్పుడే కాదు మరొక పదేళ్లు పడుతుంది అని చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ.

ఇకపోతే ఈ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ సినిమా విషయానికి వస్తే.ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube