తెలంగాణలో కాంగ్రెస్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.గత పాలకులు క్షమించరాని జీవన విధ్వంసానికి పాల్పడ్డారని తెలిపారు.
కాంగ్రెస్ పాలనలో చెరువులు సైతం నిర్వీర్యం అయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు.తొలిదశ తెలంగాణ ఉద్యమంలో 371 మంది అమరులు అయ్యారని చెప్పారు.
సమైక్యవాదులు చెలరేగిపోయారన్న కేటీఆర్ కాంగ్రెస్ నేతలు తొత్తులుగా మారారని మండిపడ్డారు.నాడు కంటతడి పెట్టని తెలంగాణవాది లేడన్నారు.
ఉద్యమంలో లేని కాంగ్రెస్ నేతలు ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారని విమర్శించారు.తెలంగాణ ఇస్తే అంధకారమన్న నేతలు ఇప్పుడు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
శ్వేతపత్రాల పేరుతో తెలంగాణను విఫలప్రయత్నంగా చూపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో విద్యుత్ లోటుతో పాటు సాగు, తాగునీటి కష్టాలు ఉండేవని చెప్పారు.
ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లామని తెలిపారు.అలాగే నీళ్లు, నిధులు, నియామకాలపై దృష్టి సారించామని వెల్లడించారు.
బీడు భూములకు నీళ్లు అందించడంతో పాటు శాంతి భద్రతలను కాపాడామని వెల్లడించారు.