బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో నటి పరిణితి చోప్రా ( Parineethi Chopra ) ఒకరు తాజా ఈమె ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా( Raghav Chadha ) ను ఎంతో అంగరంగ వైభవంగా వివాహమాడారు.ఇక వీరిద్దరి వివాహం ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది.
మూడు రోజులపాటు ఈ ప్యాలెస్ లో వీరి వివాహ వేడుకలు( Marriage Event )ఘనంగా జరిగాయి.వివాహ వేడుకకు రాజకీయ నాయకులు క్రికెటర్లు కూడా హాజరై సందడి చేశారు.
ఇక ఈ మూడు రోజులపాటు పెళ్లికి సంబంధించినటువంటి ఎలాంటి ఫోటోలు బయటకు రాకుండా ఈ జంట జాగ్రత్తలు తీసుకున్నారు.
ఈ పెళ్లికి వెళ్లే వారికి ప్రత్యేకంగా కొన్ని కండిషన్లు పెడుతూ కూడా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.అయితే వివాహం అనంతరం పరిణితి చోప్రా రాఘవ్ ఇద్దరు కూడా వారి సోషల్ మీడియా వేదికగా వీరి పెళ్లి ఫోటోలను షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.పెళ్లి దుస్తులలో వీరిద్దరూ ఎంతో అందంగా కనిపించారు.
ఇలా నవ్వుతూ పెళ్లి మండపం వద్దకు వెళ్లడం, అలాగే పూలమాలలు మార్చుకుంటూ ఉన్నటువంటి ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇక వీరి పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో ( Social media ) వైరల్ గా మారడంతో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు అభిమానులు ఈ పెళ్లి ఫోటోలపై స్పందిస్తూ ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇలా ఈ జంట అది కొద్దిమంది సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం చేసుకున్నారు.ఇక ఈనెల 30వ తేదీ గురుగ్రామ్ లో వీరి వివాహ రిసెప్షన్ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతుంది.
ఈ వేడుకకు రాజకీయ నాయకులతో పాటు సినీ సెలబ్రిటీలందరూ కూడా హాజరు కాబోతున్నారు.మొత్తానికి వీరి వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగిందని తాజాగా ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుంది.
ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.