మోడీ సహాయాన్ని తిరస్కరించిన సేవా సంస్థ

సాధారంగా స్వచ్చంద సంస్థలు, సేవా సంస్థకు ఎవరు సహాయం చేస్తారా అని చూస్తూ ఉంటాయి.మన దేశంలో విదేశాల నుంచి ఆర్ధిక సహాయం పొందుతున్న సంస్థలు అనేకం ఉన్నాయి.

 Pakistan Charity Declines Modi’s Cash-TeluguStop.com

వీటిల్లో కొన్ని బోగస్ సంస్థలు కూడా ఉన్నాయి.ఇవి చేసే సేవ తక్కువ.

పొందే సహాయం ఎక్కువ.అయితే భారత ప్రభుత్వం అందించిన కోటి రూపాయల ఆర్ధిక సహాయాన్ని తిరస్కరించిన సేవా సంస్థ ఒకటి ఉంది.

అదే పాకిస్తాన్లోని ఈదీ ఫౌండషన్.చిన్న వయసులో పొరపాటున సరిహద్దు దాటి పాకిస్తాన్లోకి వెళ్ళిపోయిన గీత అనే హిందూ బాలికను అక్కున చేర్చుకొని సంరక్షించిన సంస్థ.

మూగ -చెవిటి యువతీ గీతను రెండు రోజుల కిందట ఈదీ ఫౌండషన్ సభ్యులు ఇండియాకు తీసుకువచ్చారు .ఆ యువతిని ఆమె కుటుంబానికి అప్పగించడమే వారి లక్ష్యం.ప్రస్తుతం అన్వేషణ సాగుతోంది.ఊహ తెలియని వయసులో గీతను చేరదీసి సంరక్షించిన ఈదీ ఫౌండేషన్ మానవతా దృక్పథాన్ని అభినందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఆ సంస్థకు కోటి రూపాయల ఆర్ధిక సహాయం ప్రకటించారు.

కానీ ఇంత పెద్ద మొత్తాన్ని ఆ సంస్థ తిరస్కరించింది.ప్రభుత్వాధినేతల నుంచి విరాళం తీసుకోవడం తమ విధానం కాదని ఆ సంస్థ అధికారులు తెలిపారు.నిజానికి ఈ డబ్బు మోడీ జేబులోది కాదు.భారత ప్రభుత్వం తరపున ఇచ్చారు.

కాని ఆ సంస్థ విధానం అలా ఉంటె ఏమీ చేయలేము కదా.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube