ఈ వారం రీరిలీజ్ అయిన సినిమాలలో ఓయ్ సినిమా( Oye movie ) అదిరిపోయే రేంజ్ లో కలెక్షన్లను సాధించింది.2009లో రిలీజైన సమయంలో ఫ్లాప్ గా నిలిచిన ఓయ్ మూవీ రీరిలీజ్ లో మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాలోని పాటలు సైతం అప్పట్లో అంచనాలను మించి హిట్ అయ్యాయి.అయితే ఓయ్ సినిమాలోని అనుకోలేదేనాడు సాంగ్ వైజాగ్ లో ఒక యువతి వేసిన స్టెప్పులు నెట్టింట వైరల్ అయ్యాయి.
ఎల్లో శారీలో ఒక యువతి హీరోయిన్ కు ఏ మాత్రం తీసిపోని స్థాయిలో స్టెప్పులు వేశారు.ఈ యువతి వేసిన స్టెప్పులు వేరే లెవెల్ లో ఉన్నాయని నెటిజన్లు చెబుతున్నారు.
తన డ్యాన్స్ తో ఈ బ్యూటీ నెటిజన్లను ఫిదా చేశారు.ఓయ్ సినిమాలోని ప్రతి పాటకు ఈ యువతి థియేటర్ లో అదరగొట్టిందని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
యువతి వివరాలు తెలియకపోయినా కొంతమంది మాత్రం ఆమె ఇన్ స్టాగ్రామ్ ఐడీ గురించి సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
ఆనంద్ రంగా డైరెక్షన్ లో ఓయ్ మూవీ తెరకెక్కగా అప్పట్లో సాడ్ ఎండింగ్ సినిమాలు ప్రేక్షకులకు నచ్చకపోవడం వల్ల ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.ఓయ్ మూవీలోని హీరోయిన్ లుక్స్ విషయంలో కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.ఓయ్ సినిమాకు రీరిలీజ్ లో వచ్చిన రెస్పాన్స్ ఆ సినిమా దర్శకనిర్మాతలను సైతం ఒకింత ఆశ్చర్యపరిచింది.
ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సినిమాలను రీరిలీజ్ చేస్తే ఏ స్థాయిలో రెస్పాన్స్ వస్తుందో ఓయ్ మూవీ మరోమారు ప్రూవ్ చేసింది.సిద్దార్థ్ ఈ సినిమాలో హీరోగా నటించగా షామిలి( Shamlee ) హీరోయిన్ గా నటించారు.ఈ సినిమా సక్సెస్ సాధించి ఉంటే షామిలి తెలుగులో మరింత బిజీ అయ్యేవారని కామెంట్లు వినిపిస్తున్నాయి.